ప్రభాస్ ఎన్ని ఇండస్ట్రీ హిట్లు వదిలేశాడో తెలుసా?

డార్లింగ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండింటి తర్వాత స్పిరిట్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ మూడు సినిమాల తర్వాత కల్కి2, సలార్ 2 పూర్తిచేయాల్సి ఉంది. ఈ ఐదు సినిమాలకే ఎక్కువ సమయం పడుతోంది. తర్వాత సినిమా ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు. హోంబలే ఫిలింస్ తో వరుసగా మూడు చిత్రాలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్నారు. ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అలాగే మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా వదిలేశాడు.

కథలు నచ్చకపోవడంతో..
కొన్ని కథలు నచ్చక, మరికొన్నిసార్లు డేట్లు ఖాళీ లేక వేరే సినిమాలు చేస్తుండటంతో చేయడానికి వీలుపడలేదు. దీంతో ఆ సినిమాలన్నీ వేరే హీరోలతో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టాయి. మహేష్ బాబు సినీ జీవితాన్ని మలుపు తిప్పిన ఒక్కడు సినిమా ముందుగా ప్రభాస్ చేయాల్సింది. అయితే స్క్రిప్ట్ చాలా రిస్క్ గా ఉందనిపించడంతో కృష్ణంరాజు, ప్రభాస్ దాన్ని వద్దనుకున్నారు. అలాగే ఆర్య సినిమా కూడా సుకుమార్ ముందుగా ప్రభాస్ తో చేయాలనుకున్నారు. కానీ ఇది కూడా డార్లింగ్ వద్దనుకున్నాడు. ఇదే సినిమాను అల్లరి నరేష్ కు వినిపించగా అతను కూడా తిరస్కరించాడు. చివరకు అల్లు అర్జున్ తో తెరకెక్కింది.

rebel star Prabhas missed so many blockbuster movies in telugu industry

డేట్లు ఖాళీ లేకపోవడంతో..
రాజమౌళి సింహాద్రి సినిమా, వినాయక్ దిల్, వంశీ పైడిపల్లి బృందావనం, రాధాకృష్ణ జిల్, వినాయక్ నాయక్, గోపీచంద్ మలినేని డాన్ శీను, సురేందర్ రెడ్డి కిక్, ఊసరవెల్లి సినిమాలన్నీ ముందుగా ప్రభాస్ దగ్గరకే వచ్చాయి. కానీ వాటన్నింటినీ డార్లింగ్ వదులుకున్నారు. సింహాద్రి లాంటి మాస్ ను డీల్ చేయలేనేమోననే సందేహంతో వదులుకోగా, జిల్ సినిమాకు డేట్లు ఖాళీ లేకపోవడం, రెబల్, మిర్చి సినిమాలతో బిజీగా ఉండి నాయక్ సినిమాను వదిలేశాడు. కిక్ సినిమా చేసే సమయంలో రవితేజ ఫామ్ లో ఉండటంతో ప్రభాస్ ఓకే చెప్పేలోగా సురేందర్ రెడ్డి రవితేజ్ తో తీసేశాడు. ఇలా కొన్ని బ్లాక్ బస్టర్లను ప్రభాస్ వదులుకోవాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+