అత్యంత అరుదైన రికార్డ్ నెలకొల్పిన 'కల్కి'
పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి చిత్రం సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారతీయ సినీ ప్రేక్షకులు విజువల్ వండర్ గా కీర్తిస్తున్నారు. అన్ని భాషల్లోని ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటోంది. విడుదలైన మొదటిరోజే రూ.191.5 కోట్లు రాబట్టి మొదటిరోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలబడింది.
అద్భుత దృశ్యకావ్యమంటున్నారు
బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న కల్కి ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీనికి సంబంధించిన వివరాలను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. గురువారం విడుదలైన ఈ సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారంతో రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది. దీనిపై డార్లింగ్ అభిమానులు సామాజిక మాధ్యమాలను హోరెత్తిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించింది. దీనిపై రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు, అల్లు అర్జున్ లాంటి నటులంతా కల్కి ఓ అద్భుతమన దృశ్యకావ్యమంటూ కొనియాడారు.

అమితాబ్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు సూపర్ అంటున్నారు
అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య వచ్చిన యాక్షన్ సన్నివేశాలు, విజువల్ వండర్ దృశ్యాలు సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని పాత్రలను మహాభారతంతోపాటు పురాణాలకు లింక్ కుదర్చడంతో కర్ణుడికి సంబంధించిన చరిత్ర విశేషాలు, రీల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమా క్లైమాక్స్ చూసివారంతా కల్కి2 ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తొలిరోజే 191 కోట్ల రూపాయలకు పైగా రాబట్టడంతో తొలిరోజే రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాల జాబితాలో చేరింది. దేశవ్యాప్తంగా ఈ జాబితాలో మొత్తం 11 సినిమాలు ఉండగా అందులో ఆరు సినిమాలు డార్లింగ్ ప్రభాస్ వే ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications