ప్రభాస్ దెబ్బకు యూట్యూబ్ షేక్.. నిమిషానికి లక్ష వ్యూస్‌తో ''సలార్'' రికార్డ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అవుతుంది. ఆయన తాజాగా నటించిన సలార్ సినిమా రెండో ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఈ ట్రైలర్ ఆదివారమే విడుదల కావాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో ట్రైలర్‌ను ఈ రోజున విడుదల చేశారు. సోమవారం 3:30 నిమిషాలకు విడుదలైన సలార్ ట్రైలర్ యూట్యూబ్‌లో విధ్వంసం సృష్టిస్తుంది.
రెండు నిమిషాల 54 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రభాస్ అభిమానులు ఏమైతో కోరుకుంటున్నారో అవి సలార్‌లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ట్రైలర్ మొత్తం ఫైట్లతో నింపేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రాణ స్నేహితులు ఖాన్సార్ సామ్రాజ్యం కోసం ఎలా బద్ద శత్రువులగా మారారనేది సలార్ కథగా తెలుస్తుంది.

సినిమా కథ మొత్తాన్ని ట్రైలర్‌లోనే చూపించారు. సలార్ మొదటి ట్రైలర్ కేజీఎఫ్ ఛాయలు కనిపించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.దాంతో రెండో ట్రైలర్‌పై చిత్ర యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకున్నట్టే కనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన సలార్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. విడుదలైన నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. నిమిషానికి లక్ష వ్యూస్ సాధించి సలార్ ట్రైలర్ పెను సంచలనం సృష్టించింది.

అరగంట లోపే 1 మిలియన్ వ్యూస్ సాధించి ఏ హీరోకి అందనంత రేంజ్‌లో ప్రభాస్ నిలిచారు. గంటకు 25 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో డార్లింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకోవడంతో.. సలార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ టాక్ వస్తే సలార్ 2000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 22న విడుదల కానున్న సలార్ ధియోటర్లలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications