బ్యాచిలర్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరోయిన్.. నన్నుపెళ్లి చేసుకుంటారా?

అది 2001.. థియేటర్లలో ఒకే ఒక్క పాట వినిపిస్తే చాలు కుర్రకారు హృదయాలు ఉప్పొంగిపోయేవి. 'కనుల్లో నీ రూపమే..' అంటూ వెండితెరపై అమాయకపు నవ్వులతో వెలిగిపోయిన ఆ అందాల భామ గుర్తుందా? ఆమే రేఖ వేదవ్యాస్! మొదటి సినిమా 'ఆనందం'తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన రేఖ, ఆ తర్వాత రామ్ చరణ్, అల్లరి నరేష్ వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుని, కొన్ని సినిమాల తర్వాత అనూహ్యంగా గ్లామర్ ప్రపంచానికి దూరమయ్యారు.

రెండు దశాబ్దాలు గడిచినా, కెమెరా వెలుగులకు దూరమైనా ఆమె లైఫ్ స్టైల్, అందం మాత్రం తగ్గలేదు. కానీ, నాలుగు పదుల వయసు దాటినా ఆమె నాట్ అవుట్‌గా 'సింగిల్' లైఫ్‌నే కొనసాగిస్తుండటం ఆమె అభిమానులను ఎప్పటినుంచో వేధిస్తున్న ప్రశ్న. తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తూ.. తన పెళ్లిపై రేఖ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తుఫాన్ సృష్టిస్తున్నాయి!

Rekha Vedavyas Sends a Special Message to Bachelors Will You Marry Me

'నేను సల్మాన్ ఖాన్ టైప్ అనుకుంటా!'

"నేను ఈ రోజుకీ సింగిల్ అంటే నా ఫ్రెండ్స్ కూడా నమ్మరు. పక్కాగా ఎవరితోనో సీక్రెట్ రిలేషన్‌లో ఉండే ఉంటుంది అని ఫిక్స్ అయిపోతారు. కానీ నిజం ఏంటంటే.. నాకంటూ ఎవరూ లేరు! బహుశా బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్‌లాగే నేను కూడా జీవితాంతం పెళ్లి లేకుండా ఒంటరిగానే ఉండిపోతానేమో" అంటూ సరదాగా నవ్వేశారు రేఖ. చిన్నప్పుడు కాబోయే భర్త హ్యాండ్‌సమ్‌గా ఉండాలి, ఆరడుగుల ఎత్తు ఉండాలి అని ఎన్నో డ్రీమ్స్ ఉండేవి. కానీ జీవితం నేర్పిన పాఠాలతో ఆ ఆలోచనలన్నీ మారిపోయాయని ఆమె చెప్పారు. కాబోయే తోడు గురించి చెబుతూ.. రోటీన్ కండిషన్లను పక్కనబెట్టి ఒక క్రేజీ ఆఫర్ ఇచ్చారామె!

పర్ఫెక్ట్ అనేవారు ఉండరు

"ఈ ప్రపంచంలో 'పర్ఫెక్ట్' అనేవాడు ఉండడు. నాకూ ఆ రంగు, పొడుగు కండిషన్లు ఏమీ లేవు. నన్ను నాలా అర్థం చేసుకుని, ప్రేమించే ఒక మంచి మనసు ఉన్న మనిషి దొరికితే చాలు. నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనే సీరియస్ ఆలోచన ఉన్నవాళ్లు నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి డైరెక్ట్ మెసేజ్ చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి.. కేవలం టైమ్ పాస్ మెసేజ్లు పెడితే మాత్రం అస్సామే!" ఈ రోజుల్లో ప్రేమ పేరుతో జరుగుతున్న నాటకాలపై కూడా రేఖ చాలా ఘాటుగా స్పందించారు. "ప్రేమ వేరు, ఒకరిపై కలిగే ఆకర్షణ వేరు, సైకోలా మారే 'ఆబ్సెషన్' వేరు. 'నువ్వు నాకే సొంతం కావాలి' అని అవతలి వారి స్వేచ్ఛను హరించే ఆబ్సెషన్ చాలా ప్రమాదకరమైనది" అని హెచ్చరించారు.

అలాగే ఒకరిని ఇష్టపడితే మనసులోనే ఉంచుకోకుండా ధైర్యంగా చెప్పాలని, వన్-సైడ్ లవ్‌కు ఉన్న పవరే వేరని వ్యాఖ్యానించారు. నిజమైన ప్రేమ ఉంటే కుటుంబాలను ఒప్పించి పెళ్లి వరకు వెళ్లాలని యువతకు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి, 'ఆనందం' పిల్లకు పర్‌ఫెక్ట్ జోడీగా మారే ఆ లక్కీ మ్యాన్ ఎవరో, ఆ ఇన్‌స్టా డీఎమ్‌లలో ఎవరు రేఖ మనసు గెలుచుకుంటారో వేచి చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+