ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఫోన్ ధర ఎంతో తెలుసా?
ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకన్నా ఆయన భార్య నీతా అంబానీ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. సినిమా నటులకన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఏ వేడుకకు హాజరైనా, పార్టీలకు వెళ్లినా, పెళ్లిళ్లకు వెళ్లినా అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరయ్యా అంటే నీతా అంబానీ అని చెబుతారు. తనకున్న ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఆమె వేసుకునే దుస్తులు, చెప్పులు, పర్సుల్లాంటివన్నీ కొత్తగా ఉండటమేకాదు.. ఎంతో ప్రత్యేకత కలిగినవిగా ఉంటాయి.
నీతా అంబానీ ఇటీవల ఓ ఈవెంట్ కు వెళ్లారు. అక్కడ ఆమె ధరించిన హ్యాండ్ బ్యాగ్ ధర వైరలైంది. తాజాగా ఆమె వాడే ఫోన్ కూడా వైరలవుతోంది. అది చాలా ప్రత్యేకమైన ఫోన్. దానికి రూ.400 కోట్ల విలువచేసే వజ్రాలు, బంగారు ఆభరణాలను కలిగివుంటుందని, దీని ధరతో నాలుగు సినిమాలు చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. వాస్తవానికి ఆమె వాడే ఫోన్ ఏమిటి? వాటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

నీతా అంబానీ ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఉపయోగిస్తుంది. దీని ధర రూ.1,59,900 నుంచి రూ.1,99,900 వరకు ఉంటుంది. ఐఫోన్ లలో ఇది చాలా ఖరీదైన ఫోన్. కొత్త పెరిస్కోప్ లెన్స్, టైటానియం ఛాసిస్, ఏ 17 బయోనిక్ చిప్ లాంటి ఫీచర్లున్నాయి. 128, 256, 512 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో లభిస్తాయి. సెల్ఫీ ప్రియులకు కెమెరా బాగా ఉపయోగపడుతుంది. నీతాకు హ్యాండ్ బ్యాగ్ లంటే ఎంతో ఇష్టం. ఆమె కలెక్షన్లలో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బ్రాండ్ లు కూడా ఉన్నాయి. వాచీలను, చెప్పులను కూడా ఆమె ఇలాగే కలెక్ట్ చేస్తుంటుంది. భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితం గడుపుతారు. కానీ వారు ఎప్పుడూ విలాసాలకు అలవాటుపడలేదు. ఆడంబరంగా ఉంటారు.. మరోవైపు అతి నిరాడంబరంగాను కనిపిస్తుండటం ఈ కుటుంబ వైశిష్ట్యం.












Click it and Unblock the Notifications