పవన్ కల్యాణ్‌ను మర్చిపోలేకపోతున్న రేణు దేశాయ్..పోస్ట్ వైరల్
పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు తర్వాత రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు. పుణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె రెండో వివాహం చేసుకోవాలని భావించింది.
దీనికి సంబంధించిన ఫొటోలను కూడా రేణు దేశాయ్ విడుదల చేశారు. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతూ ఆమెను వేధించారు. ఈ విషయంలో రేణు దేశాయ్ సైతం పవన్ అభిమానులకు కౌంటరిచ్చారు. మీ అభిమాన హీరో మరో పెళ్లి చేసుకోవచ్చు కానీ.. నేను చేసుకుంటే తప్పా అంటూ అభిమానులను ప్రశ్నించారు. తాజాగా పవన్ కల్యాణ్ సాంగ్‌కు సంబంధించి ఓ పోస్ట్ చేశారామె. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రానికి ఆమె ఎడిటర్‌గా పని చేశారు.

తాజాగా దీనికి సంబంధించిన విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'ఖుషి' సినిమాలోని 'ఏ మేరా జహా' అనే సాంగ్ క్లిప్ని పోస్ట్ చేశారు. ఈ సాంగ్ కి ఎడిటర్ రేణు దేశాయ్‌గా పని చేశారు. ఈ సాంగ్ గురించి రేణు దేశాయ్ చెబుతూ.. ఇది నేను ఫస్ట్ టైం 21 ఏళ్ళ వయసులో ఎడిట్ చేసిన పాట. ఈ పాటలో ప్రతి ప్రేము నాకు గుర్తుంది అని రేణు దేశాయ్ పేర్కొంది. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ గురించి రేణు దేశాయ్ ఇటీవల కాలంలో తరుచూ మాట్లాడుతున్నారు.

దీంతో అభిమానులు రేణు దేశాయ్ పవన్ కల్యాణ్‌ను మర్చిపోలేకపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. .పవన్ కల్యాణ్‌తో కలిసి రేణు దేశాయ్ రెండు సినిమాల్లో నటించింది. బద్రి, జానీ సినిమాల్లో పవన్‌కు జోడి రేణు దేశాయ్ కనిపించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ సహజీవనంగా మారి ఆ తర్వాత పెళ్లి వరకు దారి తీసింది. బద్రి చిత్రంతో ఏర్పడ్డ పరిచయంతో పవన్ , రేణు దేశాయ్ ప్రేమలో పడ్డారు. సహజీవనం చేశాక, అకిరా పుట్టాక పెళ్లి చేసుకున్నారు. పవన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంది. అంతే కాకుండా పవన్‌తో తప్పిస్తే మరే హీరోతో కూడా రేణు దేశాయ్ నటించలేదు.












Click it and Unblock the Notifications