రేణు దేశాయ్‌కు పవన్ ఫ్యాన్స్ టార్చర్..సంచలన నిర్ణయం తీసుకున్న మాజీ భార్య

జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అయిన ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను డిలీట్ చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఆమె ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక పవన్ అభిమానులు ఉన్నారని తెలుస్తోంది. పవన్ ఫ్యాన్స్ పెట్టే టార్చర్ కారణంగానే రేణు దేశాయ్ సోషల్ మీడియా నుంచివైదొలుగుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు.

ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇదిలా ఉంటే తన మాజీ భర్త పవన్ అభిమానుల నుంచి ఆమె ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

renu desai delete facebook and twitter accounts

పవన్‌ను నేను వదిలేయలేదని..ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇక తన కొడుకు అకీరాపై పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు. అకిరాను PSPK2 అంటూ.. పవన్ కళ్యాణ్ 2 (PK 2) అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు. అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు, ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల పవన్ కల్యాణ్ మూడో భార్యతో రేణు దేశాయ్ పిల్లలు ఫొటో దిగడం జరిగింది.

renu desai delete facebook and twitter accounts

ఆ ఫొటోలను షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పవన్ ఫ్యాన్స్ నుంచి టార్చర్ ఎక్కువ కావడంతో రేణు దేశాయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ ను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్‌కు దూరం అవుతున్నట్లు తెలియజేశారు. సోషల్ మీడియా వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మాత్రం కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు.యాక్సిడెంట్ కేసులకు సహకరించడానికి, పిల్లలకు ఆహారం, మెడిసిన్స్ అందించడానికి, పిల్లులకు, కుక్కలకు మెడికల్ సౌకర్యాలు అందించడానికి, వాటి దత్తత వివరాలకు మాత్రమే 90 శాతం నేను ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తానని రేణు దేశాయ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+