ప్రేమలో పడ్డ రేణు దేశాయ్..పోస్ట్ వైరల్
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోన్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు.ఇదే సమయంలో తనని ట్రోల్ చేసి వారికి సైతం ఆమె తనదైనరీతిలో సమాధానం ఇస్తున్నారు. పవన్‌తో విడాకులపై ఆయన అభిమానులు పలుమార్లు రేణు దేశాయ్‌ను ఇబ్బంది పెట్టడం జరిగింది.
పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరిపై చేసిన కామెంట్స్‌పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్‌ను నేను వదిలేయలేదని..ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తుంటారు.

రేణు దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో సముద్ర తీరాన సూర్యాస్తమయంలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను ట్యాగ్ చేస్తూ.. 'సూర్యాస్తమయాలతో కొనసాగుతున్న నా ప్రేమకథ' అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. రేణు దేశాయ్ మరోసారి ప్రేమలో పడ్డారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే.. రేణు దేశాయ్ చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఇక ఇటీవలే ఆమె తన తర్వాత సినిమా గురించి కీలక ఆప్డేట్ ఇచ్చారు. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నానంటూ తన కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు.అయితే ఎవరి సినిమాలో నటిస్తుందో మాత్రం వెల్లడించలేదు. మొత్తానికి ఏడాది తర్వాత రేణు దేశాయ్ తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధం కావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications