కర్మ అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి..రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువుగా కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇదిలా ఉంటే తన మాజీ భర్త పవన్ అభిమానుల నుంచి ఆమె ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి.

పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరిపైపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఆకిరా నందన్ సెంట్రఫ్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా మారారు. పవన్ విజయం సాధించిన సమయంలో అకిరా తండ్రితోనే ఉన్నారు. చంద్రబాబు, ప్రధాని మోదీని పవన్ కలిసిన సమయంలో అకిరా ఆయన వెంటే ఉన్నారు. దీంతో అకిరా నందన్‌పై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

renu desai fires on netizen

ఇప్పుడు అకిరాను PSPK2 అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అకిరాను పవన్ కళ్యాణ్ 2 (PK 2) అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు. అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు, ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి పవన్ అభిమానులపై రేణు దేశాయ్ మండిపడ్డారు. తాజాగా ఆకిరా నందన్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వాడి మొహం యాక్టర్ అయ్యేలా ఉందా' అంటూ అకిరాను తక్కువ చేసి మాట్లాడాడు.

దీంతో రేణు దేశాయ్ ఆ నెటిజన్‌పై కోపడ్డారు. దీనిపై రేణు దేశాయ్ రియాక్ట్ అవుతూ... ఇలాగేనా మీ అమ్మ నిన్ను పెంచింది? కెరీర్ ప్రారంభించక ముందే ఒక అబ్బాయి గురించి ఇలా మాట్లాడతారా? ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభిస్తున్న అబ్బాయి గురించి ఇలా మాట్లాడొచ్చా? అసలు అర్హత అనే పదానికి అర్థం తెలుసా? ఒకవేళ తన మొహాన్ని చూపించేంత అర్హత తనకు లేకపోతే నువ్వు చూడకుండా ఉండటం మంచిది. నువ్వు సిగ్గులేకుండా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ నా కొడుకు గురించి నీ కామెంట్స్‌తో తక్కువ చేసి మాట్లాడతావా? నీలాంటి మనుషులను నీ తల్లిదండ్రులు ఎలా పెంచారా అని అసహ్యం వేస్తుంది.

renu desai fires on netizen

వేరే వాళ్ల పోస్టులపై కామెంట్స్ చేసే ముందు నీకు కాస్త బుద్దిని ప్రసాదించమని ఆ దేవుడిని కోరుకుంటాను అన్నారు రేణు దేశాయ్. ఈ కామెంట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో కూడా షేర్ చేశారు. నా గురించి మీరు ఏం మాట్లాడినా నేను భరిస్తాను. కానీ నా పిల్లలపై విషం చిమ్మాలనుకుంటే మాత్రం మీరు ఒక తల్లితో డీల్ చేస్తున్నారని మర్చిపోవద్దంటూ ఘాటుగానే ఆమె రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+