కల్కి సినిమాపై రేణు దేశాయ్ రివ్యూ
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన "కల్కి 2898 ఏడీ" సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పడుకోణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. గ్లింప్స్, ట్రైలర్, హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో కల్కిపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అంచనాలను అందుకుంటూ కల్కి సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కల్కి చూసిన కొందరు సినిమా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. టాలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన అంతా ప్రభాసే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్‌లో కూడా కల్కి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రభాస్ నటనకు నార్త్ జనాలు ఫిదా అవుతున్నారు. కల్కి అద్భుతంగా ఉందని, ప్రభాస్ నటన ఇరగదీశాడంటూ సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కమల్ హాసన్, అమితాబ్ నటన అద్భుతంగా ఉందని..లోపల వేరే ప్రపంచం చూపించారని ,సినిమా సూపర్ అంటూ యూత్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కల్కి సినిమాపై రేణు దేశాయ్ తన రివ్యూను తెలియజేశారు.హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఉన్న పీసీఎక్స్ స్క్రీన్‌లో రేణు దేశాయ్ తన కుటుంబంతో కలిసి కల్కి మూవీని చూడటం జరిగింది.

పవన్ కల్యాణ్ కొడుకు అకీరా కూడా 'కల్కి'టీ షర్ట్ ధరించి సినిమా చూడటం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక సినిమాపై రేణు దేశాయ్ స్పందిస్తూ.... మేమంతా కల్కి అభిమానులం. చాలా కాలం తర్వాత ఒక సినిమా చూస్తూ అరిచి గోల చేసాం. కనీసం ఒక వారం రోజులైనా మా గొంతు పనిచేయవేమో. ఈ రోజు ఉదయమే కల్కి మార్నింగ్ షో చూశాం. మీరు కూడా మీ కుటుంబాలతో కలిసి వెళ్లి ఖచ్చితంగా కల్కి సినిమా చూడండి.. అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు రేణు దేశాయ్. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో జత చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ కల్కి సినిమా గురించి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications