మీ కొడుక్కి స్త్రీలను గౌరవించడం ఎలాగో నేర్పించండి: రేణుదేశాయ్
కోల్ కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. దీనిపై దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసనబాట పట్టారు. ఇంతవరకు కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం కూడా ప్రజాస్వామికవాదులను ఆశ్చర్యపరుస్తోంది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య రాజకీయంగా ఈ కేసు నలుగుతోంది. దీన్ని అవకాశంగా వినియోగించుకోవాలని బీజేపీ, తిప్పికొట్టే క్రమంలో తృణమూల్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలమధ్య బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మహిళలను గౌరవించడం నేర్పించండి
ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా సెలబ్రిటీలంతా స్పందించారు. జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ నిందితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కోవలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా స్పందిస్తున్నారు. సంఘటన చోటుచేసుకున్నప్పటి నుంచి ప్రతిరోజు దీనిపై ఆమె పోస్ట్ పెడుతున్నారు. సమాజంలో అమ్మాయిలు జీవించాలంటే మార్షల్ ఆర్ట్స్ ఎంత అవసరమో తెలియజేస్తూ మరో పోస్ట్ పెట్టారు. స్త్రీలను గౌరవించడంపై మీ కొడుకుకు నేర్పించాలని సూచించారు. తాను కూడా తన కుమార్తెకు ఎముకలు విరగ్గొట్టడం నేర్పిస్తున్నానని చెబుతూ బ్యాగ్రౌండ్ లో కరాటే నేర్పిస్తున్న ఫొటోను షేర్ చేశారు.

స్పందించిన నెటిజన్లు.. రేణుదేశాయ్ కు మద్దతు
దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రతి మహిళకు ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ అవసరం ఎంతో ఉందని, రేణు దేశాయ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు. సమాజంలోని తల్లిదండ్రులంతా తమ కొడుకులకు మహిళలను గౌరవించడం నేర్పించాలని, చిన్నతనం నుంచి ఇలా నేర్పిస్తే వారు పెరిగి పెద్దయిన తర్వాత మహిళలపట్ల ఎంతో గౌరవంగా, మర్యాదగా మెసలుకుంటారన్నారు. సోషల్ మీడియాలో రేణుదేశాయ్ యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక సేవాకార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. తాను చేస్తున్న పనులకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటారు.












Click it and Unblock the Notifications