నేను పవన్ భార్యను కాదు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె పవన్ కల్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే పవన్ కల్యాణ్ గురించి ప్రశ్నించడంతో ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యారామె. తాను పవన్ భార్యను కాదని మరోసారి అభిమానులను హెచ్చరించారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే...పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించింది. పుణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె రెండో వివాహం చేసుకోవాలని భావించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా రేణు దేశాయ్ విడుదల చేసింది.
అయితే పవన్ కల్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్‌లు సైతం పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ వారికి గట్టిగానే కౌంటరిచ్చింది.ఆమె తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ అభిమానులపై ఫైర్ అయ్యారు. గత కొద్ది రోజుల నుంచి రేణు దేశాయ్ యానిమల్స్‌కు, చిన్నారులకు సహాయం చేస్తుంది. ఈ క్రమంలో డబ్బులు సరిపోకపోవడంతో ఫాలోవర్స్‌ను అడుగుతుంది. అయితే ఎవరో హెల్ప్ చేశారని తెలుపుతూ.. రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టింది.

దీంతో ఓ నెటిజన్ వాళ్లు కూడా మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి నేను స్వతంత్రంగా జీవిస్తున్నాను.. నేను పని చేసిన దానికి వెంటనే నాకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ అని అందరూ గుర్తుంచుకోవాలని ఆమె అభ్యర్థించింది. మీలో కొంతమంది నేను చేసే ప్రతి పోస్ట్‌ను వందల కొద్ది నా మాజీ భర్తతో ఎందుకు పోల్చాలి? నేను ఇప్పటికీ వందల కొద్ది అకౌంట్స్‌ను డిలీట్ చేసి బ్లాక్ చేసి ఉంటానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
అయితే రేణు దేశాయ్‌పై పవన్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.పవన్ కళ్యాణ్ గురించి మీరు అలా మాట్లాడటం తప్పు ఎంతైనా ఆయన మీ పిల్లలకు తండ్రి.మీ మీద ఆయనకు బాధ్యత ఉంటుందంటూ కామెంట్లు చేయడంతో రేణు దేశాయ్ పవన్ అభిమానులపై రెచ్చిపోయారు.ఫస్ట్ నేను ఇప్పుడు ఆయన భార్యని కాదంటూ అభిమానులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు నన్ను తిట్టడం చాలు నాకు లెక్చరర్స్ ఇవ్వడం కూడా ఇకపై ఆపండి అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ మండిపడ్డారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
NTR చేయాల్సిన 2 బ్లాక్బస్టర్లు ఆ హీరో దగ్గరకు ఎలా వెళ్లాయి? -
తెలుగు నిర్మాతలను అపర కుబేరులుగా మార్చిన 4 డబ్బింగ్ సినిమాలు -
‘పుష్ప2’, ‘ధురంధర్’ సినిమాల్లో అసలైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
Dhurandhar 2 First Review: బ్లడ్ బాత్.. పాకిస్థాన్ కు పిండం పెట్టాడుగా..!! -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications