కొత్త ప్రపంచం పరిచియం అయింది..రెండో పెళ్లి చేసుకుంటా - రేణు దేశాయ్
పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు. పుణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె రెండో వివాహం చేసుకోవాలని భావించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా రేణు దేశాయ్ విడుదల చేశారు. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్‌లు సైతం పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ వారికి గట్టిగానే కౌంటరిచ్చింది. మీ అభిమాన హీరో మరో పెళ్లి చేసుకోవచ్చు కానీ.. నేను చేసుకుంటే తప్పా అంటూ అభిమానులను ప్రశ్నించింది.
పవన్‌ను ఉద్దేశించి పరొక్షంగా ఆయన ఒక అమ్మాయితో బేబీని కన్నారు. ఈ మాటలు నేను చెప్పడానికి చాలా ఈజీగా అనిపించినప్పటికీ.. నిజ జీవితంలో ఇది చాలా కష్టంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌ని పిచ్చిగా ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ మీరు ఒక్కసారి ఆలోచించండి.మీ భర్తగా ఆయన ఉండి ..ఇలా మీతో చేస్తే మీకు ఏమనిస్తుందని రేణు దేశాయ్ అభిమానులను ప్రశ్నించారు. 11 ఏళ్ల కాపురం తరువాత వేరే మహిళతో ఓ బిడ్డను కంటే మీకు ఓకేనా. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందని పవన్ కల్యాణ్ అభిమానులకు రేణు దేశాయ్ కౌంటరిచ్చింది. తాజాగా ఆమె రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

రెండో పెళ్లిపై రేణు దేశాయ్ మాట్లాడుతూ...విడాకులు తీసుకున్న తర్వాత నేను రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ అప్పుడు నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. పెళ్లి చేసుకున్న తర్వాత కాస్త సమయం నా భర్తకు కేటాయించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో పిల్లల బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతే అది వారికి నాకు మధ్య దూరం పెంచుతోంది. ఆ కారణంగానే నేను పెళ్లి చేసుకోకుండా ఆగిపోయానని రేణు దేశాయ్ తెలిపారు. ఇక ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వారికంటూ ఒక కొత్త ప్రపంచం ఏర్పడింది.
అందుకే నేను కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యానని తెలిపారు.ఇక నా రెండో పెళ్లికి నా పిల్లలు కూడా వ్యతిరేకం కాదని రేణు దేశాయ్ వెల్లడించారు. ఆ ఒక్క కారణంతోనే పిల్లల కోసం పెళ్లి చేసుకోకుండా ఆగిపోయానని ఈమె తెలిపారు.ఇక ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వారికంటూ ఒక కొత్త ప్రపంచం ఏర్పడింది.అందుకే నేను కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని ఆమె తెలిపారు.ఇక నా రెండో పెళ్లికి నా పిల్లలు కూడా వ్యతిరేకం కాదని రేణు దేశాయ్ వెల్లడించారు. రెండో పెళ్లికి పిల్లలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడం ఖాయమైందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications