పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్‌పై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోన్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు. ఇదే సమయంలో తనని ట్రోల్ చేసి వారికి సైతం ఆమె తనదైన రీతిలో సమాధానం ఇస్తున్నారు. పవన్‌తో విడాకులపై ఆయన అభిమానులు పలు మార్లు రేణు దేశాయ్‌‌ను ఇబ్బంది పెట్టడం జరిగింది.

పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరు చేసిన కామెంట్‌పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ను నేను వదిలేయలేదని. ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెప్పి వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్‌ ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తుంటారు.

Renu Desai s shocking comments on Pawan Kalyan s real character

ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తాజాగా పవన్ కల్యాణ్ రియల్ క్యారెక్టర్ గురించి కామెంట్స్ చేశారు.పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా మంచిదని ఆమె చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా తాము కలిసి నటించిన జానీ మాస్టర్ సినిమా విశేషాలను ఆమె వెల్లడించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఆ చిత్ర నిర్మాతలకు పవన్ తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేశారని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

అలాగే పవన్ తాను నటించిన సినిమాలు ఫెయిల్ అయితే, పారితోషికం తిరిగి ఇచ్చేస్తుంటారనే విషయాన్ని రేణు దేశాయ్ బయటపెట్టారు. సినీ ఆర్టిస్టులకు కూడా పలు సందర్భాల్లో సాయం చేశారని ఆమె తెలిపారు. రేణు దేశాయ్ పవన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇలా, ఆయన గురించి పాజిటివ్‌గా చెప్పడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే.. రేణు దేశాయ్‌ చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్‌ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఆమె తన తర్వాత సినిమా గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నానంటూ తన కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. అయితే ఎవరి సినిమాలో నటిస్తుందో మాత్రం ఆమె వెల్లడించలేదు. మొత్తానికి ఏడాది తర్వాత రేణు దేశాయ్ తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధం కావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+