నటికి వందల సంఖ్యలో అశ్లీల మెసేజ్ లు, అందుకే హత్య, హీరో ఎంట్రీ ఉందా ? లేదా ?
హత్యకు ముందు నటి పవిత్ర గౌడ్‌కు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపేవాడని ఆరోపణ నేపథ్యంలో సిట్ అధికారులు అతడి మొబైల్ నంబర్‌ను పరిశీలించే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఈ సమయంలో నటి పవిత్ర గౌడకు హత్యకు గురైన రేణుకాస్వామి రహస్యంగా అశ్లీల సందేశాలు పంపించాడా అనే విషయంలో దర్యాప్తు వేగవంతం అయ్యింది.
రేణుకాస్వామి మృతదేహాన్ని పడేసిన డ్రెయినేజ్ లో అతని మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో పోలీసులు అతని మొబైల్ నంబర్ కొత్త సిమ్‌కార్డును తీసుకుని పరిశీలించారు. నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి 200లకు పైగా మెసేజ్ లు పంపిన సంగతి తెలిసిందే. నటుడు దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు రేణుకాస్వామి గత ఐదు నెలలుగా అసభ్య మెసేజ్ లు పంపుతున్నట్లు దర్యాప్తులో తేలింది.

రేణుకాస్వామి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 200కు పైగా అశ్లీ మెసేజ్‌లు పంపారని, అవన్నీ అసభ్యకర మెసేజ్‌లే అని తెలిసింది. కానీ పవిత్ర గౌడ అశ్లీల మెసేజ్ లు పంపించిన రేణుకాస్వామి మెసేజ్‌కి ఇంత వరకు రిప్లై ఇవ్వలేదని, దీంతో కోపోద్రిక్తుడైన రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపాడు అని, దీంతో విసిగిపోయిన పవిత్ర గౌడ ఈ విషయాన్ని పవన్‌కి తెలియజేసిందని తెలిసింది.
ఈ విషయం తెలియని రేణుకాస్వామి అతను పవిత్ర గౌడకు అశ్లీల వీడియోలు పంపిస్తూనే ఉన్నాడు. చివరికి పవిత్ర గౌడకు అశ్లీల మెసేజ్ లు పంపిస్తున్నది ఎవరు అంటూ మొత్తం ఆరా తీశాడు. చివరికి రేణుకాస్వామి ఫోటో, అతను ఎక్కడ ఉన్నాడు అంటూ పూర్తి సమాచారం సేకరించిన పవన్ రేణుకాస్వామి హత్యకు పక్కాప్లాన్ చేశాడని, చివరికి అతన్ని హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications