హైపర్ ఆదిపై మరో నటి ఫిర్యాదు..అతను చేసిన పని వల్లే జబర్దస్త్ మానేశానంటూ ఓపెన్
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోన్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత జబర్థస్త్‌లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్థస్త్ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కుపైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి పలు సీరియల్స్‌లో నటించింది. 2006లో "అంతరాత్మ" సీరియల్స్‌తో రీతూ చౌదరి కెరీర్ ప్రారంభించింది. 'గోరింటాకు' "మిస్టర్ పెళ్ళికొడుకు", "కుటుంబ సభ్యులు" 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి అనేక సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. "కేరింత". "రామలీల", "సరైనోడు" వంటి అనేక తెలుగు చిత్రాల్లో నటించింది.

ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా సంచలనం అయింది. సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్‌తో అలరించిన రీతూ చౌదరి.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి స్కిట్ చేసింది. అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి దాన్నీ సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్ధస్త్‌లో స్థానం సుస్థిరం అయింది. ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి.
అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది. అయితే జబర్థస్త్ షో మానేయడంపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను జబర్దస్త్ మానేయడానికి కారణం హైపర్ ఆదిని అని చెప్పి షాకిచ్చింది. హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడంతోనే తాను ఆ షోకు వెళ్లడం లేదని వివరణ ఇచ్చింది. హైపర్ ఆది లేనప్పుడు నేను అక్కడ ఏం చేయాలి అని ప్రశ్నించింది. హైపర్ ఆది వెళ్ళిపోయాడు కాబట్టే తాను కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసినట్లు రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. ఇటీవలే యాంకర్ అనసూయ సైతం హైపర్ ఆది వల్లే తాను జబర్దస్త్ మానేశానని తెలిపారు. ఆయన వేసే పంచ్‌లు శృతిమించడం వల్లనే అనసూయ జబర్దస్త్‌కు దూరం అయ్యారనే చర్చ సాగుతోంది.
-
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
ఈ చెట్లు మధ్యలో దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..? -
ఈ ఫోటోలో మొత్తం ఎన్ని తాబేళ్లు ఉన్నాయో చెప్పగలరా..? -
ఈ ఫోటోలో ఉన్న గుడ్లగూబను కనిపెట్టగలరా..? -
ఇంటర్నెట్ లేకుండానే "ఇన్స్టాగ్రామ్" రీల్స్ చూడడం ఎలాగంటే..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications