ఏంటీ ఆ హీరో ''గే'' నా..?
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోన్న వారిలో రీతు చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత జబర్థస్త్‌లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్థస్త్ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది.
సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కుపైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రీతూ చౌదరి తాజాగా దావత్ అనే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. వారానికి ఓ గెస్ట్‌ను ఈ షోకి పిలిచి రోస్ట్ చేయడమే షో యొక్క ముఖ్య ఉద్దేశం. తాజాగా దావత్ షోకు నటుడు నవదీప్ గెస్ట్ వచ్చాడు.

అతని సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా రీతూ చౌదరి నేరుగానే ప్రశ్నించింది. నేను నవదీప్‌కు పెద్ద పోరంబోకు ఫ్యాన్‌నిని రీతూ చెప్పుకొచ్చింది. నవదీప్ హీరోగా చేసిన పోరంబోకు సినిమా చూసిన దగ్గర నుంచి నేను ఆయనకు అభిమానిగా మారిపోయానని రీతు తెలిపింది.
ఆటగాళ్లే అని ఎవర్ని చూస్తే అనిపిస్తోందని ఓ ఆడియన్ అడిగిన ప్రశ్నకు ఇంకెవ్వరు మా రాణా బాబే అంటూ నవదీప్ సమాధానం ఇచ్చాడు. ఒకనొక సమయంలో మీరు గే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది..అంటే అన్నాడు కాని ఈ ఊహ ఎంత బాగుందో అంటూ నవదీప్‌ను డైరెక్టుగానే రీతూ చౌదరి ప్రశ్నించింది.

దీన్ని నవదీప్ చాలా సరదాగానే తీసుకున్నట్టు కనిపించింది. అయితే ఆయన ఈ ప్రశ్నకు నవదీప్ సమాధానం ఏమని చెప్పి ఉంటారా అని నెటిజన్లు అతృతుగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications