వివాదంలో యాంకర్ సుమ.. రూ.88 కోట్లకు కుచ్చుటోపీ
సెలబ్రిటీగా ఉన్నప్పుడు వాణిజ్య ప్రకటనలు చేయాలంటూ అనేక సంస్థల నుంచి అవకాశాలు వస్తుంటాయి. డబ్బులే ముఖ్యమనుకుంటే ఎటువంటి ప్రకటనల్లోనైనా నటించవచ్చు. డబ్బులు కాకుండా విలువలు ముఖ్యం అనుకున్నప్పుడు ఆచితూచి సంస్థలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటేంది. అలా చేయకపోతే తీవ్ర చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు టీవీ రంగంలో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్న సుమకు కూడా ఈ విషయం వర్తిస్తుంది. ఓ కంపెనీకి ఆమె చేసిన ప్రచారంవల్ల ప్రజలు భారీగా నష్టపోయారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న రాకీ అవెన్యూస్ సంస్థ వాణిజ్య ప్రకటనలో సుమ నటించారు. రాజమండ్రిలో ఈ సంస్థ రూ.26 లక్షలకే సొంత ఇల్లు ఇప్పిస్తామని సుమద్వారా ప్రచారం చేయించుకుంది. ప్రస్తుతం రాకీ అవెన్యూస్ బోర్డును తిప్పేసింది. సుమ మాటలను నమ్మిన ప్రజలు లక్షల రూపాయలను రాకీ అవెన్యూకు చెల్లించి ఇంటిని బుక్ చేసుకున్నారు. అలా దాదాపు రూ.88 కోట్లు వసూలు చేసిన తర్వాత రాకీ అవెన్యూస్ ప్రయివేట్ లిమిటెడ్ బోర్డు తిప్పేసింది. మోసపోయామని తెలుసుకున్న బాధితులకు తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. పోలీసులతోపాటు ప్రభుత్వానికి కూడా తమకు న్యాయం చేయాలని విన్నవించారు.

కేవలం సుమ ప్రచారం చేయడంవల్లే తాము అంత డబ్బులు చెల్లించి ఇళ్లను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చామని, దీనికి ఆమె బాధ్యత వహించాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని సుమను కోరుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కువ మోసాలు చేయడానికి అలవాటుపడుతున్నాయి. ఆయా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నవారు ఆయా కంపెనీల నేపథ్యం తెలుసుకోకుండా డబ్బులిస్తున్నారుకదా అని యాడ్స్ చేస్తున్నారని, ఇలాగే సుమ ఇబ్బందుల్లో పడ్డారంటున్నారు. ఇటీవలే టీవీ షోలు చేయడం కూడా ఆమె తగ్గించారు. సుమ అడ్డా పేరుతో ఒకటి చేస్తున్నారు. అయితే ఈవెంట్స్, ఇంటర్వూలు మాత్రం చేస్తున్నారు. తన కొడుకు రోషన్ ను హీరోగా పరిచయం చేసింది.












Click it and Unblock the Notifications