పూనకాలు పక్కా.. 'కేజీఎఫ్ 3' ముహూర్తం ఫిక్స్ చేసిన రాకీ భాయ్
కన్నడ రాకింగ్ స్టార్ యష్.. రాకీ భాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. బాహుబలి తరువాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకుంది ఈ సినిమా. 2018 లో కన్నడ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా వైడ్ మంచి సక్సెస్ ని అందుకున్న సినిమా కేజీఎఫ్-1. ఆ తరువాత 2022 లో వచ్చిన సెకండ్ పార్ట్ ఎంతటి హిట్ అయ్యిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. 1500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన టాప్ ఇండియన్ మూవీలలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఏప్రిల్ 14, 2025 కి మూడేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలోనే హోంబలే ఫిల్మ్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కేజీఎఫ్ చాప్టర్ 2లోని బెస్ట్ విజువల్స్ అన్నింటినీ కలిపి మిక్స్ చేశారు. ఈ వీడియో చివర్లో 'కేజీఎఫ్ ఛాప్టర్ 3' గురించి హింట్ అదిరిపోయే హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో కేజీఎఫ్ ఛాప్టర్ 3 త్వరలోనే రాబోతుందని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు.

ఆ వీడియో చివర్లో ''రాఖీ భాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు?'' అంటూ హింట్ ఇచ్చి గూస్ బంప్స్ తెప్పించారు. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్ర మూడో భాగం రాఖీ భాయ్ కనిపించకుండా పోయిన ఆ నాలుగేళ్లలో ఎక్కడున్నాడు? ఏం చేశాడు? అన్నది చూపించనున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక స్పెషల్ అట్రాక్షన్ గా "కేజీఎఫ్ ఛాప్టర్ 3" అనే టైటిల్‌తో పాటు యష్.. రాకీ భాయ్ గొంతుతో.... సీ యూ సూన్ అంటూ చెప్పడం పూనకాలు తెప్పిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. కేజీఎఫ్ 3 ఖచ్చితంగా ఉంటుందని.. ప్రస్తుతం తాను టాక్సిక్, రామాయణం సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. ఆ తర్వాత సరైన సమయంలో ఎంట్రీ ఇస్తాం అంటూ వెల్లడించారు.
మరోవైపు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరగగా.. గత నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇక ఏప్రిల్ 22 నుంచి జరిగే సెకండ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొంటారని మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది. దాంతో ఆ తర్వాత సలార్ 2 కానీ కేజీఎఫ్ 3 కానీ పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
-
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా!











Click it and Unblock the Notifications