బాలీవుడ్‌లో ఈ స్టార్ నటీనటులపై కూడా "గన్ ఫైరింగ్" అటాక్ !

సినీ పరిశ్రమలో అగ్రస్థాయి దర్శకులు, నటులు, సంగీతకారులు.. స్టార్‌డమ్ ఎంత పెద్దదైతే, ముప్పు కూడా అంతే తీవ్రమైనదిగా మారుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ సెలబ్రిటీల నివాసాలు, వ్యక్తిగత జీవితాలు కాల్పుల ఘటనలతో వణికిపోయాయి. తాజాగా దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటన ఈ భద్రతా సమస్యను మరోసారి హాట్ టాపిక్‌గా మార్చింది.

బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలు ఇవే...

రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు..

ముంబైలోని ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం బయట గుర్తుతెలియని వ్యక్తులు కనీసం 4 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే ఘటన సమయంలో ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది హెచ్చరిక దాడి (warning attack) అయి ఉండవచ్చన్న కోణంలోనూ విచారణ చేపట్టారు. రోహిత్ శెట్టి లాంటి టాప్ కమర్షియల్ డైరెక్టర్‌ను టార్గెట్ చేయడం పరిశ్రమలో కలకలం రేపింది.

rohith-shetty-gun-firing-issue-make-hude-terror-and-other-star-actors-list-in-bollywood

సల్మాన్ ఖాన్ - గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పై కాల్పులు..

ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్ బాల్కనీపై ఇద్దరు దుండగులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడికి బాధ్యత స్వీకరించింది. గతంలో సల్మాన్‌కు వచ్చిన బెదిరింపులకు ఇది కొనసాగింపుగా భావిస్తున్నారు. ఈ కారణంతో సల్మాన్ ఖాన్ భద్రతను Y+ నుంచి Z+ కేటగిరీకి పెంచారు. అపార్ట్‌మెంట్ చుట్టూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

దిశా పటానీ ఇంటిపై కాల్పులు..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో దిశా పటానీ ఇంటిపై బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 7-8 రౌండ్లు కాల్పులు జరిపారు. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బరార్ గ్రూప్ ఈ ఘటన వెనుక ఉందని పోలీసుల అనుమానం లేక సెలబ్రిటీని భయపెట్టే ఉద్దేశ్యమా? ఈ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

రాకేష్ రోషన్‌పై అండర్‌వ‌రల్డ్ దాడి..

'కహో నా ప్యార్ హై' సూపర్ హిట్ అయిన తర్వాత, అండర్‌వ‌రల్డ్ నుంచి వచ్చిన డబ్బు డిమాండ్‌ను తిరస్కరించడంతో దర్శకుడు రాకేష్ రోషన్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయనే స్వయంగా కారు నడుపుకుంటూ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆయన వ్యక్తిగత భద్రతను భారీగా పెంచారు.

సన్నీ డియోల్ షూటింగ్‌లో హత్య మిస్టరీ..

'జట్ తే జమీన్' సినిమా షూటింగ్ సమయంలో సన్నీ డియోల్ మామ అయిన వీరేంద్ర సింగ్‌ను కాల్చి చంపారు. ఈ హత్య వెనుక కారణాలు ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు. ఇది బాలీవుడ్‌లో అత్యంత మిస్టీరియస్ క్రైమ్ కేసులలో ఒకటిగా మిగిలింది.

సిద్ధూ మూసేవాలా హత్య..

పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో పగటిపూటే ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలాను దుండగులు కాల్చి చంపారు. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బరార్ ఈ హత్యకు బాధ్యత వహించాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు కూడా ఈ కేసులో ప్రధానంగా వినిపించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా షాక్ వేవ్స్ సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+