Romanchakam: చిన్న సినిమాకు అద్దిరిపోయే కలెక్షన్స్..
ఇటీవలి కాలంలో చిన్న సినిమాలదే హవా నడుస్తోంది. పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు రిలీజై ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలం అవుతున్నాయి. రూ. వందల కోట్లతో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సైలెంట్ గా వచ్చిన చిన్న సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలాంటి ట్రెండ్ కొనసాగుతోంది. అంతేకాక ఇటీవలికాలంలో లవ్ స్టోరీస్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3 న విడుదలైన మూవీ 'రోమాంచకం'.. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సొంత నిర్మాణ సంస్థ అయిన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. అటు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ మూవీని ప్రొమోట్ చేయడంతో రిలీజ్ కు ముందే రోమాంచకం మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక 'రోమాంచకం' మూవీ ఫస్ట్ డే రోజున రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి ఈ కలెక్షన్లు అని చెప్పొచ్చు. రెండో రోజు ఈ మూవీ రూ. 1.47 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలో రోమాంచకం మూవీకి రెండు రోజుల్లోనే రూ.3.22కోట్లు రావడం విశేషం. ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన సుమంత్ ప్రభాస్ కు ఇవి మంచి వసూళ్లని చెప్పొచ్చు. ఈ మూవీకి రూ. 10 కోట్ల బడ్జెట్ ఖర్చు కాగా ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి రికవరీ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. శని, ఆదివారాలు పుంజుకుంటే ఈ మూవీ సెకండ్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రోమాంచకం మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో కామెడీ, స్టోరీలోని సస్పెన్స్, హీరో హీరోయిన్ మధ్య సాగే కెమిస్ట్రీ స్క్రీన్ పై వర్కవుట్ అయినట్లు స్పష్టం అవుతోంది. ఇది మస్త్ టైమ్ పాస్ మూవీ అని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. డైరెక్టర్ గా వేణుగోపాల్ రెడ్డికి ఇది ఫస్ట్ మూవీ అయినప్పటికీ సినిమా చూస్తుంటే ఆ ఫీల్ కనిపించదట. చాలా సీన్స్ లో ఆయన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఇక సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంట ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే వీరి ఫ్రెండ్స్ గా చేసిన నరేంద్ర రవి, వెంకటేశ్ కాకుమాను తదితరులు స్క్రీన్ పై నవ్వులు పూయించారని తెలుస్తోంది. మొత్తానికి రోమాంచకం మూవీ క్లీన్ కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications