సుమంత్ ప్రభాస్ 'రోమాంచకం' ట్రైలర్ రిలీజ్.. అన్నీ ఉన్నాయిగా..!

టాలీవుడ్ లో కొత్తతరం పుట్టుకొస్తూనే ఉంది. యువ నటీనటులు ఎప్పటికప్పుడు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్స్.. ఇతర సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన యంగ్ యాక్టర్స్ ఇప్పుడు చిన్న సినిమాలతో హిట్ కొట్టి హీరోలుగా రాణిస్తున్నారు. వారిలో సుమంత్ ప్రభాస్ ఒకరు. మేమ్ ఫేమస్, గోదారి గట్టుపైన చిత్రాలతో హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సుమంత్ ప్రభాస్. ఆయన హీరోగా తాజాగా నటిస్తున్న సినిమా 'రోమాంచకం'.. టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ అలాగే ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ మూవీలో సుమంత్ ప్రభాస్ కు జోడీగా అనంతిక సానిల్‌కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వాసుకి వైభవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. భద్రకాళి పిక్చర్స్ నుంచి వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే సంస్థ నుంచి వస్తున్న మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. నేటి కాలంలో డేటింగ్ యాప్స్, రిలేషన్ షిప్స్ అలాగే ఊహించని మలుపులతో కూడిన యూత్ ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

Romanchakam Sumanth Prabhas released a blend of romance and comedy grand release on September 3rd

ఇక ట్రైలర్ విషయానికి వస్తే చాలా ఫన్నీ వేలో సాగుతుంది. ఈ ట్రైలర్ లో సుమంత్ ప్రభాస్ తనదైన తెలంగాణ నేటివిటీ యాసతో ఆకట్టుకున్నారు. అలాగే తన మార్క్ కామెడీ అండ్ ఎనర్జిటిక్ నటనతో మరోసారి యువతను ఆకట్టుకునేలా కనిపించారు. తొలుత సరదాగా సాగిన ట్రైలర్ ఆ తర్వాత ఉత్కంఠ భరితంగా.. ట్విస్టులతో.. ఎమోషనల్ గా సాగుతుంది. ట్రైలర్ చూస్తే మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని అనిపిస్తోంది. ట్రైలర్ తో యూత్ లో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఇప్పటికే మేమ్ ఫేమస్, గోదారి గట్టుపైన చిత్రాలతో హిట్ కొట్టిన ఆయన ఇప్పుడు రోమాంచకం చిత్రంతోనూ మరోసారి యువత ఆకట్టుకునేందుకు వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+