ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ఏకైక తెలుగు సినిమా
ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కు భారీ ఆదాయాన్ని, కోట్లాది మంది కొత్త సబ్‌స్క్రైబర్లను తెచ్చిపెట్టి సంచలనం సృష్టించిన భారతీయ చిత్రం 'ఆర్.ఆర్.ఆర్' (RRR). నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యధిక కాలం, అత్యధిక సంఖ్యలో వీక్షించబడిన తొలి భారతీయ సినిమాగా RRR సరికొత్త రికార్డు నమోదు చేసింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లు రెండూ కలిపి దాదాపు రూ. 300 కోట్లకు పైగా వెచ్చించి ఈ చిత్ర డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ దక్షిణాది భాషల హక్కులను పొందగా, నెట్‌ఫ్లిక్స్ హిందీ వెర్షన్‌ను సొంతం చేసుకుంది.
ఇందులో RRR హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో 43.6 మిలియన్లకు పైగా వ్యూస్ (130 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ గంటలు) సాధించి ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లీష్ సినిమాల విభాగంలో 60కి పైగా దేశాల్లో ట్రెండింగ్‌లో నిలవడంతో పాటు వరుసగా 14 వారాల పాటు గ్లోబల్ టాప్-10లో కొనసాగిన ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది.

నెట్ ఫ్లిక్స్ కు కొత్త సబ్ స్క్రైబర్లు వచ్చారు
RRR ప్రభావంతో అమెరికా, యూరప్, జపాన్ వంటి పాశ్చాత్త్య దేశాల నుండి నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త సబ్‌స్క్రైబర్లు భారీగా పెరిగారు. అనేకమంది హాలీవుడ్ ప్రముఖులు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించడం, 'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం వంటి అంశాలు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన బ్రాండ్ వాల్యూను తెచ్చిపెట్టడంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు కనకవర్షం కురిపిస్తూ భారీ యాడ్ రెవెన్యూను అందించాయి
రికార్డు స్థాయిలో వీక్షణ
సాధారణంగా ఒకే సినిమా థియేట్రికల్ రన్ ముగిసాక ఒకే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలవుతుంది. కానీ 'RRR' క్రేజ్ దృష్ట్యా దక్షిణాది భాషలు (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) అమెజాన్ ప్రైమ్‌లో, హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో ఒకే సమయంలో విడుదలై రికార్డు స్థాయి వ్యూయర్ షిప్‌ను సాధించాయి. నెట్‌ఫ్లిక్స్ డేటా ప్రకారం, RRR సాధించిన 130 మిలియన్ల స్ట్రీమింగ్ గంటల్లో 50% కంటే ఎక్కువ వీక్షణలు భారతదేశం వెలుపలి నుంచే రావడం విశేషం.
ముఖ్యంగా ఉత్తర అమెరికా (USA), బ్రెజిల్, మెక్సికో, బ్రిటన్ దేశాల్లో ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. RRR సాధించిన ఈ ఊహించని విజయం తర్వాతే నెట్‌ఫ్లిక్స్ భారతీయ ప్రాంతీయ సినిమాలపై, భారీ యాక్షన్ చిత్రాలపై పెట్టుబడులను గణనీయంగా పెంచింది. ఇండియన్ కంటెంట్‌కు గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌కు నిరూపించి చూపించింది.














Click it and Unblock the Notifications
