రూ.40 కోట్లు నష్టం.. అల్లు అర్జున్ వల్లే అల్లు అరవింద్‌కి బిగ్ షాక్ !!

తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్, 'గీత ఆర్ట్స్' బ్యానర్‌పై అనేక అద్భుత చిత్రాలను నిర్మిస్తూ, టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ముఖ్యంగా, 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో, ఆయన గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన తదుపరి ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అల్లు అరవింద్‌కు రూ.40 కోట్ల నష్టం..

అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్‌గా దూసుకుపోతూ, ఒక్క సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. అయితే ఆయన వల్ల అల్లు అరవింద్ గతంలో రూ.40 కోట్ల నష్టాన్ని చవిచూశారట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమా 'బద్రీనాథ్'. ఈ మూవీకి బడ్జెట్ అనుకున్న దానికంటే రెండింతలు పెరగడం.. అప్పటి బన్నీ మార్కెట్‌ను మించిపోవడం జరిగింది. ఈ సినిమా రిజల్ట్ తేడా కొడుతుందని ముందు నుంచే అల్లు అరవింద్ భావించినప్పటికీ.. అల్లు అర్జున్ పట్టుబట్టడంతో సినిమా పూర్తి చేశారు.

rs-40-crores-loss-to-allu-aravind-because-of-allu-arjun

కానీ అనుకున్నట్టుగానే 'బద్రీనాథ్' సినిమా డిజాస్టర్ అయింది. భారీ బడ్జెట్ కారణంగా ఆ సినిమాకు సుమారు రూ.40 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని అల్లు అరవింద్ తెలిపారు. ఆ దెబ్బతోనే చాలా రోజులు పెద్ద సినిమాలు నిర్మించలేదని.. తిరిగి కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని స్పష్టం చేశారు. కెరీర్‌లో ఇలాంటి అనుభవాలు కూడా మంచివేనని, అవి మరోసారి జాగ్రత్త పడేందుకు ఉపయోగపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

AA 22..

ప్రస్తుతం అల్లు అర్జున్ తన 22వ సినిమా (AA 22 వర్కింగ్ టైటిల్) కోసం తమిళ అగ్ర దర్శకుడు అట్లీతో కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా దీపికా పదుకునే నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో బన్నీ మూడు తరాలకు చెందిన నలుగురు వ్యక్తుల పాత్రల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా అల్లు అర్జున్ స్క్రీన్ పై సందడి చేయనున్నారని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బన్నీ సైతం కొంచెం పెద్ద వయసులో ఉన్నట్టు గడ్డానికి రంగు వేసిన ఫోటోలు వైరల్ అవ్వడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

AA 22 చిత్రం పునర్జన్మల కాన్సెప్ట్‌తో పాటు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో లింక్ అయి రాబోతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీని సాంకేతిక విలువలను పెంచేందుకు, హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ (VFX) సంస్థ ఈ సినిమా కోసం పని చేస్తుండటం విశేషం. అంతేకాకుండా ఈ మూవీలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపికా పదుకునే ఫిక్స్ అవ్వగా.. మిగిలిన హీరోయిన్ల గురించి త్వరలోనే అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+