ఈ స్టార్ బ్యూటీ తండ్రి.. పాక్‌తో యుద్ధం చేస్తూ చనిపోయారని తెలుసా..!
చిత్ర పరిశ్రమలో కన్నడ బ్యూటీ "రుక్మిణీ వసంత్" ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. 2019లో 'బీర్బల్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ 2023లో వచ్చిన 'సప్త సాగరాలు దాటి' చిత్రంతో కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో సహజమైన నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక తెలుగులో నిఖిల్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంలో నటించినా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.
ఆ తరువాత "బఘీరా", "బైరతి రంగల్", "ఏస్" చిత్రాల్లో నటించినప్పటికీ, పెద్ద విజయం పొందలేకపోయినా.. ప్రేక్షకుల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రీసెంట్ గానే శివ కార్తికేయన్‌తో నటించిన "మదరాసి" సినిమా సెప్టెంబర్ 5న విడుదలైంది. ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా కానీ.. బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అలానే రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన "కాంతారా: చాప్టర్ 1" సినిమాలో నటించి మెప్పించింది. భారీ హిట్ కొట్టిన ఈ మూవీలో అమ్మడు నటనకు ఫ్యాన్స్ ఫుల్ ఫీదా అవుతున్నారు.

రుక్మిణి కుటుంబం..
రుక్మిణి 1997 డిసెంబర్ 10న జన్మించింది. ఆమె చిన్నతనంలోనే తండ్రి వసంత్ వేణుగోపాల్ మృతి చెందారు. ఆయన భారత సైన్యంలో కల్నల్ గా సేవలందిస్తూ.. జమ్మూ-కాశ్మీర్ లోని ఉరి సెక్టార్‌లో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరమరణం పొందారు.
2007లో కల్నల్ వసంత్ వేణుగోపాల్ 8 మంది పాక్ ఉగ్రవాదులను ఎదుర్కొంటూ ఉరి ప్రాంతాల్లో మిషన్‌లో ప్రాణాలను విడిచారు. ఈ సందర్భంలో ఆయన శరీరంలో 7 బుల్లెట్లు తగిలాయి. ఆయన ధైర్యాన్ని గుర్తించి భారత ప్రభుత్వం అశోక చక్ర పతకం అందించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ పురస్కారం పొందిన మొదటి వ్యక్తి ఆయనే.

ఎన్టీఆర్ తో సినిమా..
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్‌లో ఆమె పాల్గొన్నట్టు సమాచారం. అలానే ఈ మూవీ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు అనుకుంటున్నారు. మేకర్స్ కూడా ఆమె క్రేజ్, యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అడిగినంత పారితోషికాన్ని ఇస్తున్నారని టాక్.












Click it and Unblock the Notifications