ఆ లెజెండ్ బయోపిక్‌లో ఎన్టీఆర్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రశాంత్ నీల్‌తో కలిసి చేస్తున్న భారీ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉండగానే, వార్-2, దేవర-2 చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. దర్శకధీరుడు రాజమౌళితో ఎన్టీఆర్ కలిసి ఓ బయోపిక్‌లో నటించనున్నారనేది ఆ వార్త సారాంశం.

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తండ్రిగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పించనుండగా, ఆయన తనయుడు కార్తికేయ మరియు వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారని సమాచారం. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి 'మేడ్ ఇన్ ఇండియా' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

rumor that NTR is doing a movie in Dadasaheb Phalke biopic

ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రను ఎన్టీఆర్ పోషించనున్నారనే వార్త అభిమానుల్లోనూ, నెటిజన్లలోనూ తీవ్రమైన ఉత్సాహాన్ని నింపుతోంది. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడినప్పటికీ, ఇతర సినిమా పనుల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్ట్ తెరపైకి రావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి జీవిత కథలో ఎన్టీఆర్ నటించనుండటం నిజంగానే గొప్ప విషయం. అయితే, ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. కానీ, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది అనడంలో సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+