భర్తను వదిలేసి తనకంటే 7 ఏళ్ల చిన్నోడితో ఎఫైర్
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. జాతీయ అవార్డులు సాధించిన ఓ హీరోయిన్ కట్టుకున్న భర్తకు విడాకులిచ్చి, వయస్సులో తనకంటే చిన్నవాడితో రిలేషన్‌లో ఉంది.
కొంకణా సేన్ శర్మ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా బెంగాలీ సినిమాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉన్న కొంకణా, బాల నటిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.ప్రముఖ నటి, దర్శకురాలు అపర్ణా సేన్ కుమార్తెగా కొంకణాకు సినీ రంగం మీద మంచి అవగాహన ఉంది.కొంకణా తన కెరీర్‌లో అనేక రకాల పాత్రలను పోషించింది. సాంప్రదాయ పాత్రల నుండి ఆధునిక మహిళ పాత్రల వరకు అన్ని రకాల పాత్రలకు ఆమె జీవం పోసింది.

తన అద్భుతమైన నటనకు గాను కొంకణా అనేక అవార్డులను అందుకుంది. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆమెకు లభించాయి.నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొంకణా, దర్శకురాలిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇంద్ర ,ఒమకారా, లైఫ్ ఇన్ ఎ మెట్రో,పేజ్ 3, మిసెస్. అయ్యర్ వంటి సినిమాలు కొంకణా సేన్ శర్మకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే ఈ భామ తన భర్తకు విడాకులిచ్చింది. కొంకణా, రణవీర్ షోరేతో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. ఈ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది.2010లో ఈ జంట వివాహం చేసుకున్నారు.
వారికి హరూన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ జంట 2015లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత అమ్మడు మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కొంకణా ప్రముఖ నటుడు అమోల్ పరాశర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అమోల్ కొంకణా కంటే 7 సంవత్సరాలు చిన్నవాడు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో పనిచేశారు.దీంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై వీరిద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications