పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న తమన్నా..? అతని వల్లే అంటూ పోస్ట్

హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు కావొస్తున్న తమన్నాలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువగా నటిస్తోంది.

తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తమన్నా తళుక్కున మెరిసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లారు.

Rumors on social media that Tamanna is pregnant without marriage

దీంతో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందని అందరికి అర్థం అయింది. ఇదే సమయంలో తమ బంధంపై ఈ జంట గతేడాది చివర్లో ఓ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని..త్వరలోనే పెళ్లికి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది.పలు ఈవెంట్స్‌లో తమన్నాతో కలిసి విజయ్ వర్మ సందడి చేశారు.

పలు ఫంక్షన్స్‌లో తమన్నా హ్యాండ్ బ్యాగులు కూడా మోస్తూ విజయ్ వర్మ కనిపించారు. ఇక పెళ్లే అనుకున్న తరుణంలో ప్రియుడు వర్మకు షాకిచ్చింది తమన్నా. ప్రియుడు వర్మకు సంబంధించిన ఫొటోలు,వీడియోలను మిల్కీ బ్యూటీ డిలీట్ చేసింది.తమన్నా, విజయ్ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతోనే వీరు విడిపోయినట్టు తెలుస్తోంది. దీంతో తమన్నా, విజయ్ వర్మల బంధం మధ్యలోనే ముగిసిపోయింది.

అయితే బ్రేకప్‌పై వీరిద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా తమన్నాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.ఈ వీడియోలో తమన్నా చాలా బొద్దుగా కనిపించింది. ఫ్రంట్ ,బ్యాక్‌ లావుగా కనిపించడంతో అది చూసిన నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అయిందని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు విజయ్ వర్మ వల్ల సైలెంట్‌గా ప్రెగ్నెంట్ అయి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు.ప్రస్తుతం తమన్నా వీడియో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+