విడాకుల బాట పట్టిన మరో స్టార్ హీరో..?
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకలు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లో మరో స్టార్ హీరో చేరాడు.బాలీవుడ్ హీరో, మాజీ ఎంపీ గోవిందా సైతం తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారు.గోవిందా పూర్తి పేరు గోవింద అరుణ్ ఆహుజా. గోవిందా 1986లో "ఇల్జామ్" సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు."రాజా బాబు", "కూలీ నెం. 1", "హీరో నెం. 1", "పార్టనర్" వంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.గోవిందా తన కామెడీ, డ్యాన్స్ , ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లకు ధీటుగా గోవిందా అభిమానులను సంపాదించుకున్నారు.
అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గోవిందా క్రేజ్ తగ్గిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో ఆయన వైవాహిక జీవితంపై కూడా అనేక రూమర్స్ తెర మీదకు వచ్చాయి. గోవిందా తన భార్య
సునీత అహుజా విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.కొంతకాలంగా వారిద్దరి మధ్య సంబంధాలలో సమస్యలు తలెత్తాయని, అందువల్ల వారు విడిపోతున్నారని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై స్పందించిన గోవింద మేనేజర్, "వారు విడాకులు తీసుకోవడం నిజం కాదు. కొంతమంది వ్యక్తులు చేసిన వ్యాఖ్యల వల్ల ఈ వార్తలు వచ్చాయి. మా కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయభేదాలు సహజం, కానీ వాటి వల్ల విడాకులు తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ, తాను గోవిందా వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నామని, తాను ఒక ఫ్లాట్‌లో తన పిల్లలతో ఉంటుండగా, గోవిందా ఎదురుగా ఉన్న బంగళాలో నివసిస్తున్నారని తెలిపారు. దీనితో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే దీనిపై గోవిందా ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications