ఈ ఆఫ్ఘన్ బ్యూటీకి శివుడిపై భక్తి.. మనసు దోచే ఇండియన్ అబ్బాయి కోసం వెయిటింగ్!
ఆఫ్ఘనిస్తాన్ అందాల భామ సదాఫ్ శంకర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ప్రముఖ డేటింగ్ రియాలిటీ షో 'స్ప్లిట్స్‌విల్లా 16' ద్వారా గుర్తింపు పొందిన ఈ మోడల్, తన గ్లామర్, వ్యక్తిత్వంతో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఆ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సదాఫ్ శంకర్, తనదైన స్ట్రాటజీ, ఆటతీరుతో హాట్ టాపిక్‌గా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జన్మించినప్పటికీ.. గత 10 ఏళ్లుగా ఆమె ఇండియాలోనే నివసిస్తోంది. ఈ షోలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సదాఫ్ శంకర్.. తన మనసు దోచుకునే 'ఇండియన్ అబ్బాయి' కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
వైట్ బికినీలో గ్లామర్ షో
తాజాగా సదాఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వైట్ బికినీలో ఆమె ఇచ్చిన సిజ్లింగ్ పోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బికినీకి జతగా సన్ గ్లాసెస్, స్టైలిష్ హెయిర్ బన్, గ్లోయింగ్ మేకప్‌తో ఆమె ఒక 'గ్లామరస్ డీవా'లా కనిపిస్తోంది. ఈ ఫోటోలలో ఆమెతో పాటు మరో కంటెస్టెంట్ సౌందర్య కూడా కనిపించింది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం షోలో కూడా హైలైట్‌గా మారుతోంది.

పేరు వెనుక ఉన్న 'శివ భక్తి' మర్మం!
సదాఫ్ ఓ ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ.. తన పేరు పక్కన 'శంకర్' అని తగిలించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది. "నేను పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ, భగవంతుడైన శివుడికి వీర భక్తురాలిని. శివుడిపై ఉన్న ప్రేమ, భక్తితోనే నా పేరు పక్కన 'శంకర్' అని చేర్చుకున్నాను." అని సదాఫ్ పేర్కొంది.
ఇండియాపై మక్కువ
తాను పుట్టింది ఆఫ్ఘనిస్తాన్ లో అయినప్పటికీ.. మనసు మాత్రం పూర్తిగా భారతీయురాలిదే అని సదాఫ్ గర్వంగా చెబుతోంది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత అంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే ఈ షో ద్వారా ఇండియాకు 'కోడలు' కావాలని, ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఆమె కోరుకుంటోంది. ప్రస్తుతం ఈ ఆఫ్ఘన్ బ్యూటీ 'స్ప్లిట్స్‌విల్లా 16' విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా, తన బోల్డ్ లుక్స్, విలక్షణమైన వ్యక్తిత్వంతో సదాఫ్ శంకర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.












Click it and Unblock the Notifications