మొత్తానికి పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన మెగా హీరో
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్, అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. 'పిల్లా నువ్వు లేని జీవితం' 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్', 'తిక్క', 'విన్నర్', 'నక్షత్రం', 'జవాన్', 'ఇంటిలిజెంట్', 'తేజ్ ఐ లవ్ యు', 'ప్రతి రోజూ పండగే', 'చిత్రలహరి', 'సోలో బ్రతుకే సో బెటర్', 'రిపబ్లిక్', 'విరూపాక్ష' వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
ఇక సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి గత కొంతకాలంగా అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ మెహరీన్ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. 'జవాన్'మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో , వీరు తమ రిలేషన్‌ను పెళ్లిగా మార్చాలని అనుకుంటున్నారంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అలాంటిది ఏమీ లేదని సాయి ధరమ్ తేజ్ టీం ఈ వార్తలను ఖండించింది. సాయి ధరమ్ తేజ్ పలువురు హీరోయిన్స్‌లో రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరోయిన్ రెజీనా ,'తిక్క' సినిమా హీరోయిన్‌తోనూ సాయి ధరమ్ తేజ్ ఎఫైర్ నడిపినట్టు వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే తాజాగా సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాయి ధరమ్ ఓ డిఫరెంట్ లుక్‌తో దర్శనిమిచ్చాడు. రెండు చేతులతో నమస్కారం చేస్తున్నట్లు స్టిల్ ఇచ్చిన ఫొటోను షేర్ చేసి.. 'ప్రకాశవంతంగా వెలుగుతున్న ప్రతి ఒక్కరినీ విస్మరించాలి.. హ్యాపీ సింగిల్స్ డే 11/11/24' అనే క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌తో సాయి ధరమ్ తేజ్ తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసినట్టు అయింది.












Click it and Unblock the Notifications