మెగా ఇంట పెళ్లి బాజాలు..ఆ హీరోయిన్‌తో మెగా హీరో పెళ్లి ఫిక్స్..?

మెగా ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇప్పటికే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిన విషయమే. వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది.

లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..ఘనంగా వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. తాజాగా మరో మెగా హీరో కూడా వరుణ్ తేజ్ బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే మెగా అల్లుడైన సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే సాయి ధరమ్ తేజ్ ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటున్నారంటూ ఓ వార్త వైరల్‌ అవుతోంది.

Sai Dharam tej is Going to Marry Actress Mehreen

సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ మెహరీన్‌ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. 'జవాన్'మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో , వీరు తమ రిలేషన్‌ను పెళ్లిగా మార్చాలని అనుకుంటున్నారంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ పలువురు హీరోయిన్స్‌లో రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరోయిన్ రెజీనా ,'తిక్క' సినిమా హీరోయిన్‌‌తోనూ సాయిధరమ్ ఎఫైర్ నడిపినట్టు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+