సాయిపల్లవి, విజయ్ సేతుపతి కెమిస్ట్రీ అదుర్స్.. షూటింగ్ ఫోటోలు వైరల్!
భారత సినీ ఇండస్ట్రీలోనే ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ కోల్‌కతాలో శరవేగంగా జరుగుతోంది. ఆదివారం కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జిపై వీరిద్దరి మధ్య కీలక సీన్లను చిత్రీకరించగా.. ఆ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో విజయ్ సేతుపతి క్లీన్ షేవ్ లుక్ లో కనిపిస్తుండగా.. సాయిపల్లవి అందమైన డ్రెస్ లో కనిపించారు. వారిద్దరు హౌరా బ్రిడ్డిపై నవ్వుతూ మాట్లాడుకోవడం, ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నడుస్తున్న దృశ్యాలు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
"ప్రొడక్షన్ నంబర్ 23" అనే తాత్కాలిక పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి మొదటి చిత్రం కాగా.. విజయ్ సేతుపతి 2018లో వచ్చిన 'నవాబ్' సినిమా తర్వాత మళ్లీ మణిరత్నం డైరెక్షన్లో నటిస్తున్న రెండో సినిమా ఇదే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ సౌత్ సొంతం చేసుకుంది. మణిరత్నం-ఏఆర్ రెహమాన్ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

#VijaySethupathi and #SaiPallavi pair already winning hearts ❤️🖤 pic.twitter.com/Q7ZcYhjtmk
— Balaji (@RDBalaji) July 26, 2026
విజయ్ సేతుపతి, సాయిపల్లవిలు తమ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి 'ఏస్', 'తలైవన్ తలైవి'వంటి సినిమా తర్వాత 2026 ప్రారంభంలో 'గాంధీ టాక్స్'తో అలరించారు. అలాగే ఆయన చేతిలో'ట్రెయిన్', 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్' వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు సాయిపల్లవి గతేడాది 'తండేల్' సినిమాతో మెప్పించగా.. ప్రస్తుతం బాలీవుడ్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక 'రామాయణ:పార్ట్ 1 , పార్ట్ 2' చిత్రాల్లో సీత పాత్రలో నటిస్తున్నారు.
'96' meets 'Ramayana' - The beloved Ram from 96 and the ethereal Sita Maa of Ramayana. Vijay Sethupathi and Sai Pallavi are currently filming a late-night schedule on Kolkata's Howrah Bridge.
— Ayantika Chattopadhyay ( অয়ন্তিকা ) (@honubroto) July 26, 2026
Director - Mani Ratnam#VijaySethupathi#SaiPallavi#Kolkata pic.twitter.com/LCCsi0nc5U














Click it and Unblock the Notifications