రామ్ చరణ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని సాయి పల్లవి..?
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

తెలుగుతో పాటు, తమిళంలో కూడా సాయి పల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవల అమరన్ మూవీతో మరో బ్లాక్ బ్లాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా సాయి పల్లవి మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు సుకుమార్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో రంగస్థలం వంటి సూపర్ హిట్ వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-2 సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా హడావిడి పూర్తి అవ్వగానే రామ్ చరణ్ సినిమాను పట్టాలు ఎక్కించనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఇటు మెగా ఫ్యాన్స్, సాయి పల్లవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సినిమాను సాయి పల్లవి ఓకే చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే..నాగ చైతన్యతో 'తండేల్' మూవీలో నటిస్తోంది. బాలీవుడ్‌లో 'రామాయణం' సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది.












Click it and Unblock the Notifications