చిరంజీవితో సినిమానా సారీ చేయలేను- సాయి పల్లవి
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ''ప్రేమమ్'' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. తాజాగా సాయి పల్లవికి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. గార్గి సినిమాలో సాయి పల్లవి నటనగానూ ఈ అవార్డు ఆమెకు దక్కింది. ఇదిలా ఉంటే సాయి పల్లవికి గతంలో చిరంజీవితో నటించే అవకాశం వచ్చిన ఆమె ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమాలో ఆయన చెల్లెలు క్యారెక్టర్‌కు మొదట సాయి పల్లవినే సంప్రదించారట.
అయితే ఆ రోల్‌ను నేచురల్ బ్యూటీ రిజెక్ట్ చేసింది. ఇక ఓ సందర్భంలో సాయిపల్లవి మెగాస్టార్ సినిమాలో నటించకపోవడానికి కారణం చెప్పుకొచ్చింది. తనకు రీమేక్ సినిమాల్లో నటించడం పెద్దగా ఆసక్తి ఉండదని తెలిపింది. ఆ కారణంగానే చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్నట్టు సాయి పల్లవి తెలిపింది. దీంతో ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టార్‌గా నిలిచింది. ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే..నాగ చైతన్యతో 'తండేల్' మూవీలో నటిస్తోంది. బాలీవుడ్‌లో 'రామాయణం' సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది.












Click it and Unblock the Notifications