ఆ హీరోకు నేషనల్ అవార్డు వస్తే నాకేంటి... నేను చేయను: సాయిపల్లవి
తన అందమైన వ్యక్తిత్వంతో, మహోన్నతమైన సిద్ధాంతంతో దేశంలోని అన్ని భాషలకు చెందిన సినీ పరిశ్రమల్లో మంచి కీర్తిప్రతిష్టలను హీరోయిన్ సాయిపల్లవి సంపాదించుకుంది. సహజమైన అందంతో అలరారే ఈ అందం ఫిదా సినిమాతో తొలిసారిగా తెలుగువారికి పరిచయం అయింది. ఆఫర్లు వచ్చాయని ఏ సినిమా పడితే ఆ సినిమాను ఎంచుకోదు. తన పాత్రకు కచ్చితంగా ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటుంది. ప్రాధాన్యం లేదనిపిస్తే అతను ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద నిర్మాత అయినా నిర్మొహమాటంగా తిరస్కరిస్తుంది. చేసిన సినిమాలు తక్కువైనప్పటికీ టాప్ స్థానంలో నిలిచిందంటే అందుకు కారణం ఆమె ఎంచుకునే పాత్రలే.
ఎవరైనా సరే.. సినిమా చేయను
ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో నటించింది. వచ్చేనెలలో విడుదల కాబోతోంది. తమిళంలో విడుదలైన అమరన్ సంచలన విజయాన్ని దక్కించుకోవడంలో సాయిపల్లవి కనపరచిన అభినయమే ప్రధానమని చెప్పొచ్చు. చిరంజీవి చెల్లెలిగా భోళాశంకర్ సినిలాలో సాయిపల్లవిని అడిగినప్పటికీ పాత్రకు ప్రాధాన్యం లేదని చిరంజీవి పక్కన అయినా వద్దని చెప్పేసింది. తాజాగా తమిళంలో హిట్ చిత్రాల డైరెక్టర్ అరుణ్ కుమార్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. అరుణ్ కుమార్ మండేలా, మావీరన్ లాంటి మంచి హిట్స్ ఇచ్చాడు. మంచి ఫామ్ లో ఉన్న అరుణ్ కుమార్ సినిమా చేయాలని అడిగితే చేయనని ఖరాఖండిగా చెప్పేసింది.

పాత్రకు స్కోప్ లేదని వద్దని చెప్పింది
జాతీయ అవార్డు గ్రహీత, హీరో విక్రమ్ సరసన అని చెప్పినా నో చెప్పింది. క్యారెక్టర్ కు స్కోప్ లేదని, అంతే కాకుండా తన కాల్షీట్లు కూడా ఖాళీ లేవని చెప్పేసింది. ప్రస్తుతం సాయిపల్లవి ఈ సినిమాను తిరస్కరించడం అనేది తమిళ చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. తండేల్ సినిమా వచ్చే నెల ఏడోతేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణంలో సీతగా నటిస్తోంది. రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్, సూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. మొదటి నుంచి ఎంతో రిజర్వుడుగా కనిపించే సాయిపల్లివి వ్యక్తిత్వం చాలా అద్భుతమైందని ఆమె స్నేహితులు చెబుతుంటారు. అందుకే సినీ పరిశ్రమలో కూడా మంచిపేరు తెచ్చుకుందని కొనియాడుతుంటారు. విక్రమ్ సరసన సినిమాను తిరస్కరించడంపై నెటిజన్లు కూడా కథకే ప్రాధాన్యమివ్వాలని, అప్పుడే కెరీర్ లో ముందుకు వెళతారని, మంచి నిర్ణయం తీసుకుందంటూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications