సలార్.. ఓటీటీ హక్కులు ఖరార్: రికార్డు రేటుకు దక్కించుకున్న ఆ ఓటీటీ

Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం.. సలార్. ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంటకే బొమ్మ పడింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుందీ భారీ బడ్జెట్ మూవీ. థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తోన్నారు.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Salaar digital rights have been sold to Netflix, says reports

సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల అయింది. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ విడుదలైన మరుసటి రోజే సలార్ తెర మీదికి వచ్చింది. తొలి రోజు కలెక్షన్లు డంకీని మించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమా ఓటీటీ హక్కులు ఖరారు అయ్యాయి. టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. విడుదలైన రోజు నుంచి ఎనిమిది వారాల తరువాత ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో చూడొచ్చు. దీని కోసం సలార్ యూనిట్‌కు ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసింది నెట్ ఫ్లిక్స్ మేనేజ్‌మెంట్.

Salaar digital rights have been sold to Netflix, says reports

దీనికోసం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్టీ ప్లస్ హాట్ స్టార్ పోటీ పడ్డాయని చెబుతున్నారు. రికార్డ్ రేటుకు నెట్ ఫ్లిక్స్.. డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ విషయంపై సలార్ నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తమ సినిమా నెట్ ఫ్లిక్స్‌కు విక్రయించిన విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు.

గతంలో ప్రభాస్- పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్‌ డిజిటల్ హక్కులను తీసుకుంది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో లాభాలను ఇవ్వలేదు. కొనుగోలు విషయంలో ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నష్టపోయిందనేది ట్రేడ్ టాక్. అందువల్లే దాన్ని భర్తీ చేసేలా సలార్ డిజిటల్ రైట్స్‌ విషయంలో నెట్ ఫ్లిక్స్‌కే ప్రయారిటీ ఇచ్చారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+