'సలార్' కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్
ప్రస్తుతం సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియా కూడా సలార్ గురించే చర్చ నడుస్తోంది. ఆరు సంవత్సరాల తర్వాత పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.. సలార్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడనే సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబడుతోంది. మొదటిరోజు రూ.180 కోట్లు, రెండో రోజు రూ.150కోట్లు రాబట్టింది.
ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో నటించినవారంతా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసుకున్న పారితోషికం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. బాహుబలి సినిమా తర్వాత చేసే ప్రతి సినిమాకు రూ.100 కోట్లకు తక్కువ కాకుండా ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అంతేకాకుండా అదనంగా లాభాల్లో 10 శాతం వాటా తీసుకుంటున్నాడు. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఎంతిచ్చారు? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ తర్వాత అదే స్థాయిలో ప్రశాంత్ నీల్ పారితోషికం తీసుకున్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ కు రూ.100 కోట్లు ముట్టజెప్పారంటున్నారు. సినిమా కన్నా రెమ్యునరేషన్లకే నిర్మాత ఎక్కువ బడ్జెట్ ను పెట్టినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చేలా చేసి.. ప్రభాస్ కు హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ కు ఎంత ఇచ్చినా తప్పులేదని డార్లింగ్ అభిమానులు అంటున్నారు. ఈ రూ.100 కోట్లు అనేది రెండు భాగాలకు కలిపి ఇచ్చారా..? లేదంటే ఒక పార్ట్ కే అంతిచ్చారా? అనే విషయంలో స్పష్టత లేదు.












Click it and Unblock the Notifications