'సలార్' సెన్సార్ రిపోర్ట్
యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ వారు నిర్మిస్తున్నారు. డిసెంబరు 22వ తేదీన విడుదలవడానికి సిద్ధమైంది. వాస్తవానికి సెప్టెంబరు 28వ తేదీనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సినిమాలో కొన్ని సన్నివేశాలు సరిగా రాకపోవడంతో రాజీపడని ప్రశాంత్ నీల్ సినిమా విడుదలను వాయిదావేసి మరీ వీటిని చిత్రీకరించారు.
ప్రభాస్, శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితర నటులు కీలక పాత్ర పోషించారు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని డార్లింగ్ అభిమానులు పెట్టుకున్నారు. ఎందుకంటే బాహుబలి2 తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సలార్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సినిమా 2 గంటల 55 నిముషాల 22 సెకన్లు ఉంది.

సినిమా ప్రారంభమైన అరగంట వరకు ప్రభాస్ కనిపించడు. ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ ఇచ్చారంటే దీన్ని కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు చూడలేరు. ఒక ట్రైలర్ విడుదలైనప్పటికీ కొంతమందిని అది ఆకట్టుకోలేకపోయింది. మళ్లీ మరో ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ప్రభాస్ సినిమాలకు వెళ్లేవాళ్లు విపరీతంగా ఊహించుకొని భారీస్థాయిలో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని వెళుతున్నారు. దీంతో ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా సినిమా ఫ్లాప్ అవుతోంది. అందుకే సలార్ కు అలా కాకుండా ప్రభాస్ ను చూపించడకుండా, ఎవరూ అంచనాలు పెట్టుకోని విధంగా తీర్చిదిద్దాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారంట. ట్రైలర్ లో ప్రభాస్ ను సాదాసీదాగా చూపించి, థియేటర్లకు వెళ్లిన తర్వాత వారి అంచనాలకు తగిన విధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారంట. సినిమా విడులైతేకానీ ఎలా ఉందనేది తెలియదు. అప్పటివరకు ఓర్పు పట్టడమే.












Click it and Unblock the Notifications