5 కేజీఎఫ్ లు కలిస్తే ఒక సలార్?

KGF2 మనదేశంలో ఎంతటి సంచనాలు సృష్టించిందో తెలుసుకదా. ఆ సినిమా ఏకంగా రూ.1200 కోట్లు రాబట్టింది. ఇండియన్ టాప్-5 మూవీస్ లో ఒకటిగా నిలిచింది.ఇలాంటి సినిమాను మించిపోయేలా ప్రశాంత్ నీల్ సలార్‌ను తెరకెక్కిస్తున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. కెజియఫ్ తర్వాత బిగ్ స్కేల్‌తో భారీ బడ్జెట్‌తో సలార్‌ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు హోంబలే ఫిలింస్.

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఈనెల 22న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఆ సినిమా ఫొటోగ్రఫీ డైరెక్టర్ భువనగౌడ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఫస్ట్ సినిమా ఉగ్రమ్ నుంచి సలార్ వరకు ఈయనే సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఈ ఇద్దరి కాంబినేష్‌న్లో వస్తున్న నాలుగో సినిమా ఇది.

salaar movie is bigger than the kgf movie

కెజియఫ్‌ స్కేల్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా సలార్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. సలార్ కు, కేజీఎఫ్ సినిమాకు సంబంధం లేదని, ట్రైలర్ ను చూసి ఈ సినిమాను అంచనా వేయలేరన్నారు. ఈసినిమాలోని ఫైర్-లైట్ విజువల్స్ KGFని పోలి ఉంటాయని, KGFసెట్‌లో సలార్ షూట్ చేయలేదని, సలార్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ అండ్ టీమ్ 100 ఎకరాల్లో భారీ సెట్లు రూపొందించినట్లు వెల్లడించారు.

వీటికి అదనంగా దండుమైలారంలో అర కిలోమీటరు గోడ, 100 ఎకరాల్లో భారీ సెట్లు నిర్మించినట్లు తెలిపాడు. సలార్ స్కేల్ KGF కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని, సాంకేతికంగా దీన్ని వేరే లెవల్ అనేలా తెరకెక్కించామన్నాడు. రోజు రోజుకి అంచనాలను పెంచేస్తున్న సలార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+