బాక్సాఫీస్ ను దున్నేస్తున్న బుల్ డోజర్!!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో సినిమా చూస్తున్న అందరికీ గూస్ బంప్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేశాడు. అనకాపల్లి నుంచి అమెరికా వరకు అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సంచలన ఓపెనింగ్స్ ని రాబట్టింది.
రెండు రోజుల్లో దాదాపు 330 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టింది సలార్. రెండోరోజు రూ.150 కోట్ల కలెక్షన్స్ రావడంతో 2023లో విడుదలైన అన్ని సినిమాల డే 1 కన్నా సలార్ డే 2 ఎక్కువగా రాబట్టింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ అధికారికంగా బయటకి రాలేదు కానీ ఓవర్సీస్ రిపోర్ట్ మాత్రం వచ్చింది. నార్త్ అమెరికాలో సలార్ సినిమా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటోంది.

సలార్ సినిమా మొదటిరోజు 4 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసింది. రెండో రోజు పూర్తయ్యేసరికి నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసింది. సలార్ సినిమా 5.5 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉంది. ఇది ప్రభాస్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ డే ప్రీమియర్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. సలార్ సినిమాను నార్త్ అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్ విడుదల చేసింది. అత్యధిక సంఖ్యలో షోస్ సలార్ సినిమాకి దక్కేలా చేసిన ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో హోంబలే ఫిల్మ్స్ కన్నా యాక్టివ్ గా ఉండి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది. బుల్డోజర్ బాక్సాఫీస్ ని దున్నేస్తోంది అంటూ ట్వీట్స్ చేస్తోంది. అంతేకాదు ప్రత్యంగిరా సినిమాస్ ప్రభాస్ కి నాన్ స్టాప్ ఎలివేషన్స్ ఇస్తూనే ఉంది.












Click it and Unblock the Notifications