సలార్ సీక్వెల్ టైటిల్.. రివీల్: రోమాలు నిక్కబొడిచేలా..: ఫ్యాన్స్ రచ్చ రచ్చ
Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం.. సలార్. ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంటకే బొమ్మ పడింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుందీ భారీ బడ్జెట్ మూవీ. థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తోన్నారు.
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల అయింది. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ విడుదలైన మరుసటి రోజే సలార్ తెర మీదికి వచ్చింది. తొలి రోజు కలెక్షన్లు డంకీని మించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇదివరకే ప్రకటించింది యూనిట్. దీనికోసం ఇప్పటి నుంచి ఎదురు చూసేలా చేసింది మూవీ. క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అదే సమయంలో పార్ట్ 2 టైటిల్ ట్యాగ్‌ను రివీల్ చేశాడు. ఇది- పార్ట్ 2పై అంచనాలను పెంచింది.
సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ (Salaar Part 1 Ceasefire) పేరుతో తెరకెక్కగా.. దీనికి సీక్వెల్‌కు మరింత హైప్ ఇచ్చే టైటిల్ ట్యాగ్ లైన్ పెట్టారు. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం (Salaar Part 2 Shauryanga Parvam) అనే క్యాప్షన్‌తో రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2025లో సీక్వెల్ రిలీజ్ అవ్వొచ్చనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications