సలార్ విడుదల వేళ.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక వ్యాఖ్యలు
Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం.. సలార్. ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంటకే బొమ్మ పడింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుందీ భారీ బడ్జెట్ మూవీ. థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తోన్నారు.
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల అయింది. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ విడుదలైన మరుసటి రోజే సలార్ తెర మీదికి వచ్చింది. తొలి రోజు కలెక్షన్లు డంకీని మించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమా విడుదల వేళ.. పృథ్వీరాజ్ సుకుమారన్ తెర మీదికి వచ్చాడు. టీమిండియా బ్యాటర్ సంజు శాంసన్‌పై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే ఇంటర్నేషనల్స్‌లో అతను సెంచరీ చేసిన విషయం తెలిసిందే. గురువారం సంజు శాంసన్ సెంచరీ, శుక్రవారం సలార్ విజయ విహారం అని అర్థం వచ్చేలా తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టాడు. సంజు శాంసన్‌ను నేచురల్ గిఫ్టెడ్ బ్యాటర్‌గా అభివర్ణించాడు. సమకాలీన క్రికెట్‌లో అతను ఓ అద్భుతం అని వ్యాఖ్యానించాడు.

దక్షిణాఫ్రికాలోని పార్ల్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ సంజు శాంసన్ సెంచరీతో కదం తొక్కాడు. 114 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 108 పరుగులు చేశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లల్లో 218 పరుగులు ఆలౌట్ అయింది. ఓపెనర్ టోనీ డీ జోర్జీ ఒక్కడే టాప్ స్కోరర్. 81 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మరోసారి తుఫాన్‌లా విరుచుకుపడ్డాడు. తొలి వన్డేలో అయిదు వికెట్లు కూల్చిన అర్ష్‌దీప్.. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు.












Click it and Unblock the Notifications