అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్ ఏదో తెలుసా..?
స్టార్ హీరోస్ పెద్ద సినిమాలు చేస్తే ఆ కిక్కే వేరు. చిన్న అప్డేట్ కోసం రాత్రిబవంళ్లు ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. పోస్టర్ నుంచి సినిమా రిలీజ్ తొలి రోజు వరకూ ప్రతీదీ ట్రెండింగ్ లోకి వస్తుంది. ఇక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ విధ్వంసం వేరే లెవెల్ లో ఉంటుంది. టీజర్, ట్రైలర్ అప్డేట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు ఫ్యాన్స్. మోరి టాలీవుడ్ లో ఇప్పటివరకు రిలీజైన అన్ని ట్రైలర్, టీజర్ లలో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్ ఏదో ఇక్కడ తెలుసుకుందాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ టీజర్ .. ప్రస్తుతం తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ లేదా టీజర్ గా నిలిచింది. ఈ టీజర్ 2023, జులై 6 న విడుదలైంది ఇప్పటివరకు 14 కోట్ల 96 లక్షల 24 వేల మంది ఈ టీజర్ ను చూశారు. ఈ టీజర్ కు 25 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. ఇక సలార్ తర్వాత రెండో స్థానంలో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 ది రూల్ టీజర్ ఉంది. ఈ టీజర్ ను మైత్రీ మూవీ మేకర్స్ 2024 ఏప్రిల్ 8 న విడుదల చేశారు. అయితే ఇప్పటివరకు ఈ టీజర్ కు 12 కోట్ల 46 లక్షల 86 వేల వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ టీజర్ కు 17 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

ఇక మూడో స్థానంలోనూ పుష్ప రాజ్ నిలవడం విశేషం. పుష్ప-1 టీజర్ ప్రస్తుతం మూడోస్థానంలో ఉంది. ఈ టీజర్ ను 2021 ఏప్రిల్ 7 న రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఈ టీజర్ కు 9 కోట్ల 92 లక్షల 19 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 21 లక్షల లైక్స్ వచ్చాయి. నాలుగో ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ను 2021 డిసెంబర్ 9 న విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు 8 కోట్ల 66 లక్షల 25 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 19 లక్షల లైక్స్ వచ్చాయి. ఇక ఐదో స్థానంలో ఆర్ఆర్ఆర్ లోని ఎన్టీఆర్ పాత్ర భీమ్ ను పరిచయం చేస్తూ రిలీజైన టీజర్ ఉంది. ఈ టీజర్ 2020 అక్టోబర్ 20 న విడుదలైంది. ఈ టీజర్ ను ఇప్పటివరకు 7 కోట్ల 70 లక్షల 85 వేలకు పైగా చూశారు. 16 లక్షల మంది లైక్ చేశారు.
ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో వస్తున్న ఓజీ మూవీ ట్రైలర్ రిలీజైంది. రిలీజైన 3 గంటల్లోనే దాదాపు 30 లక్షలకుపైగా వ్యూస్, 5 లక్షలకు చేరువలో లైక్స్ సాధించింది. మరి రానున్న రోజుల్లో ఈ ట్రైలర్ యూట్యూబ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications