ఆమె బాత్రూంలో నా ఫోటో చూసి షాక్ అయ్యానంటున్న స్టార్ హీరో
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి దేశ విదేశాల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1988లో Biwi Ho To Aisi అనే చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. 1989లో వచ్చిన మైనే ప్యార్ కియా సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయారు. ఆ తర్వాత హమ్ ఆప్కే హై కౌన్, కరణ్ అర్జున్, జుడ్వా, ప్యార్ కియా తో డర్నా క్యా, తేరే నామ్, వాంటెడ్, దబాంగ్, బజరంగీ భాయిజాన్, సుల్తాన్, కిక్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో తన సూపర్ స్టార్ స్టేటస్‌ను నిలబెట్టుకున్నాడు.
కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, టీవీ హోస్ట్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా Bigg Boss రియాలిటీ షో హోస్ట్‌గా ఎంతో క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం 50 ఏళ్ల వయస్సు దాటినా ఇప్పటికీ ఎనర్జీ తగ్గకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. హిట్స్-ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తనదైన స్టైల్‌లో కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గానే మురుగదాస్ దర్శకత్వంలో "సికిందర్" అనే భారీ యాక్షన్ సినిమా చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, సల్మాన్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం తనకు సంబంధించిన ఒక వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవల 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్న సల్మాన్, తన పోస్టర్లు బట్టల షాపులు, సెలూన్లలో వాడుతున్నారు అని సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే అసలు హైలైట్ ఏమిటంటే - ఓ స్టార్ హీరోయిన్ తన పోస్టర్‌ను బాత్రూమ్‌లో పెట్టుకుందన్న విషయాన్ని కూడా వెల్లడించారు. దీంతో ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అని జోరుగా చర్చ జరుగుతోంది.
ఎవరా స్టార్ హీరోయిన్..
ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. కరీనా కపూర్. నేను వేరే వ్యక్తి ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. ఓ సారి కరీనా ఇంటికి వెళ్లినప్పుడు స్వయంగా చూసి షాక్ అయ్యాను. అప్పుడు ఆమె వయసు 8 ఏళ్లు.
కానీ 15 ఏళ్లు వచ్చాక నా ఫోటో తీసేసి రాహుల్ రాయ్ ఫోటో పెట్టుకుంది అంటూ సరదాగా చెప్పారు సల్మాన్ ఖాన్. దీంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక సల్మాన్, కరీనా కలిసి Kyun Ki, Bodyguard, Bajrangi Bhaijaan వంటి సినిమాల్లో నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఆ సినిమాల్లో బాగా వర్కౌట్ అయింది. అప్పట్లో వీరి మధ్య రిలేషన్ ఉందని కూడా గాసిప్స్ వచ్చాయి. కరీనా కపూర్ నటుడు సైఫ్ అలీఖాన్ ని వివాహం చేసుకున్న సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications