సల్మాన్ ఖాన్ బెదిరింపుతో ఏడ్చేసిన నటి

Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తన సినిమాల సెట్స్‌లో అనేక సార్లు సరదాగా గొడవలు పెట్టుకొని తోటి నటులను అల్లరి పట్టిస్తుంటారు. 2003లో వచ్చిన "తేరే నామ్" సినిమా షూటింగ్‌లో సల్మాన్ ఖాన్ తన సహనటిని ఆటపట్టించిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

"తేరే నామ్" సినిమా సెట్‌లో జరిగిన సంఘటన
ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రామాయణ్" చిత్రంలో నటిస్తున్న ఇందిరా కృష్ణన్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. "తేరే నామ్" సినిమాలో ఒక సన్నివేశంలో తాను సల్మాన్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టాల్సి ఉందని.. అయితే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు సల్మాన్ ఖాన్ ఆమెను సరదగా భయపెట్టారని వెల్లడించారు.

Salman Khan s Prank Scared Actress Indira Krishnan to Tears on Tere Naam Set

సల్మాన్ ఖాన్ బెదిరింపు
సల్మాన్ ఖాన్ ఇందిరాతో "నువ్వు నన్ను చెంపదెబ్బ కొడితే, ఆ తర్వాత ఏమైనా జరగవచ్చు.. చూసుకో" అని సరదాగా హెచ్చరించారు. స్క్రిప్ట్‌లో భాగంగా చెంపదెబ్బ కొట్టిన తర్వాత కూడా ఈ సరదా కొనసాగింది. నటిని మరింత భయపెట్టడానికి సల్మాన్ తన బాడీగార్డ్‌ను కూడా ఈ ఆటలో చేర్చుకున్నారు. బాడీగార్డ్ ఇందిరాతో "మేడమ్, మీరు ఏం చేశారు? మీడియా వాళ్ళు వచ్చేశారు. మీరు మీ వ్యాన్‌లో వెళ్లి కూర్చోండి" అని చెప్పాడు. దీంతో భయపడిన ఇందిరా.. బయట చూస్తే నిజంగానే మీడియా ప్రతినిధులు కనిపించడంతో మరింత ఆందోళన చెందారు.

భయందోళనకు గురైన ఇందిరా కృష్ణన్
ఆ సమయంలో సినిమా సెట్స్‌కు మీడియా రావడం సాధారణమే అయినా.. ఇందిరా కృష్ణన్ ఆందోళనతో కన్నీరు పెట్టుకున్నారు. "మేడమ్, మిమ్మల్ని ఇండస్ట్రీ నుంచి నిషేధిస్తారు. మీరు భాయ్‌ను చెంపదెబ్బ కొట్టారు!" అని బాడీగార్డ్ చెప్పడంతో ఆమె ఏడ్చేశారు. దాదాపు గంట పాటు ఈ ప్రచారం కొనసాగిన తర్వాత, సల్మాన్ అది కేవలం ఒక సరదా ఆట అని చెప్పడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు.

ఇందిరా కృష్ణన్ కెరీర్
నటి ఇందిరా కృష్ణన్ ప్రస్తుతం నితేష్ తివారీ రూపొందిస్తున్న 'రామాయణ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపిస్తారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, కునాల్ కపూర్, లారా దత్తా వంటి ప్రముఖ నటులు కూడా భాగమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+