తప్పు చేశా .. నాగ చైతన్యతో విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్..?

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ తరువాత కొలుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

సమంత ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది . సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది.ఈ వెబ్‌సిరీస్‌లో సమంతతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత స్పై పాత్రలో కనిపిస్తారని సమాచారం. సమంత తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సమంత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు.

Samantha admits to making mistakes in the past

గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్‌ను ప్రమోట్ చేశారు. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమంత సమాధానం ఇచ్చారు. అవును నేను గతంలో తప్పులు చేశాను. దాని గురించి ఏమీ తెలియనప్పుడు. కానీ నేను చాలా వాటిని అంగీకరించడం మానేశాను. నేను చెప్పేవాటినే నమ్ముతాను. లేదంటే దేవుడు ఆగ్రహిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితే సమంత చేసిన కామెంట్స్‌లో నాగ చైతన్యతో విడాకులు గురించి కూడా పరొక్షంగా స్పందించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం తప్పే అని ఒప్పుకున్నట్లు అయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పుకార్లను సమంత అభిమానులు ఖండిస్తున్నారు. మరోవైపు సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లతో రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి పలుమార్లు దర్శనం ఇచ్చారు. సమంత మాత్రం సింగిల్‌గానే కొనసాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+