చిరునవ్వుతో నాగ చైతన్యను పలకరించిన సమంత..ఎంత క్యూట్‌గా ఉన్నారో..!
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదిస్తున్నారు.
విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడిపోయిన తరువాత ఈ జంట నేరుగా కలిసింది లేదు. కానీ తాజాగా వీరిద్దరు కలిసి ఒకే వేదికపై దర్శనం ఇచ్చారు. అమెజాన్ ప్రైమ్ ముంబై వేదికగా ప్రమోషన్ ఓ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ ఒరిజినల్ ప్రాజెక్ట్స్‌లో భాగమైన నటీనటులను సాంకేతిక నిపుణులను ఈ ఈవెంట్‌కు హాజరయ్యేలా ప్లాన్ చేసింది.

. కరణ్ జోహార్ ఈ కార్యక్రమానికి హోస్టగా వ్యవహరించారు. ఇక బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత సిటాడల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈవెంట్‌కు అటెండ్ అయింది . అలాగే నాగచైతన్య నటించిన "దూత" వెబ్ సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. సమంత ,నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఈ ఈవెంట్‌లో భాగమయ్యారు .వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications