పార్టీలో డ్యాన్స్ ఇరగదీసిన సమంత - వరుణ్ ధావన్ (వీడియో)
దక్షిణాది బ్యూటీ సమంత నటించిన హనీబన్నీ వెబ్ సిరీస్ ఈనెల ఏడోతేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఇది రీమేక్. సిటాడెల్ లో ప్రియాంకచోప్రా పాత్రను హనీబన్నీలో సమంత పోషించారు. వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ తాజాగా అత్యధిక వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించింది. దీంతో ఈ సందర్భంగాన్ని పురస్కరించుకొని టీం ముంబయిలో ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీలో వరుణ్ ధావన్, సమంత డ్యాన్స్ సూపర్ గా వేశారు. వీరి డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. పార్టీకి హనీబన్నీ టీం మొత్తం హాజరై సందడి సందడి చేశారు.
కేక్ కట్ చేసి అందరూ తినిపించుకున్నారు
పార్టీలో కేక్ కట్ చేసి ఒకర్నొకరు తినిపించుకున్నారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ తమిళంలో విజయ్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా తెరిని బేబీ జాన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని నైన్ మటక్కా పాటకు వరుణ్, సమంత అదిరిపోయే డ్యాన్స్ వేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను సమంత తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకుంది. అందమైన సాయంత్రం వేళ మంచి మనసున్న వ్యక్తులతో సమయాన్ని గడిపానని, నా మనసు ఎంతో సంతోషంతో, కృతజ్ఞతతో నిండిపోయిందనే క్యాప్షన్ జోడించింది. ఈ పోస్టుకు వరుణ్ ధావన్ బదులిచ్చాడు. సమంత ఎప్పటికీ ది బెస్ట్ కో స్టార్ అని స్టార్ ఎమోజీని బదులుగా ఇచ్చాడు.

బదులిచ్చిన దర్శక ద్వయం
హనీబన్నీ దర్శకులు రాజ్ అండ్ డీకే కూడా ఎంతో కష్టమైన ప్రయాణం తర్వాత అందరూ సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటున్న పార్టీ అంటూ బదులిచ్చారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం సమంత దేశవ్యాప్తంగా పర్యటించడంతోపాటు అనేక ఛానాళ్లకు ఇంటర్వ్యూలిచ్చింది. ప్రస్తుతం తన సొంత బ్యానరు ట్రూలాలపై తెలుగులో కథానాయిక ప్రాధాన్యం ఉన్న మాఇంటి బంగారం సినిమా చేస్తున్నారు. రాజ్ అండ్ డీకేతో మరో వెబ్ సిరీస్ ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయికానీ దీన్ని సమంత అధికారికంగా ధ్రువీకరించలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఒంటరిగా జీవిస్తున్న సమంత మయోసైటిస్ త్వరలోనే పూర్తిగా నయమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
varun and samantha dancing on nain matakka song, damn i’m obsessed 😭🔥 pic.twitter.com/NW65HBPxN9
— Annesha (@ApnaaVarun) November 28, 2024












Click it and Unblock the Notifications