నాగచైతన్యకు ఛాలెంజ్ విసిరిన సమంత

దక్షిణాది బ్యూటీ సమంత నటించిన హనీబన్నీ వెబ్ సిరీస్ ఈనెల ఏడోతేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారమవుతోంది. మిక్స్ డ్ టాక్ కొన్నిచోట్ల, హిట్ టాక్ మరికొన్నిచోట్ల వచ్చింది. యాక్షన్ సన్నివేశాల్లో సమంత బాగా నటించిందని, ఇలా నటిస్తుందని ఊహించలేదంటూ కామెంట్లు వస్తున్నాయి. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో కథానాయకుడిగా వరుణ్ ధావన్ నటించాడు. హనీబన్నీకి సంబంధించి ఇంటర్వ్యూలిస్తూ సమంత బిజీగా ఉంటోంది. అయితే ఇంత క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలున్న సిరీస్ లో నటించేందుకు సమంత ఎంత పారితోషికం తీసుకుందనే విషయం ఇప్పుడు వైరలవుతోంది.

రూ.10 కోట్లు తీసుకున్న సమంత
ఈ సిరీస్ లో నటించినందుకు సమంతకు రూ.10 కోట్లు చెల్లించారు. హీరోగా నటించిన వరుణ్ ధావన్ కు రూ.8 కోట్లు ఇచ్చారు. అందుకు కారణం.. సమంతకు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతంగా తీసుకురాగల సత్తా సమంతకు ఉంది. ఓవర్సీస్ లో అంతమంది అభిమానులున్నారు. అందుకే అంత పారితోషికం చెల్లించారని వార్తలు వస్తున్నాయి. తన మాజీ భర్త నాగచైతన్య పారితోషికం కూడా దాదాపుగా ఇంతే ఉంటుంది. అయితే ఈ సిరీస్ తో నాగచైతన్య పారితోషికాన్ని మించి తీసుకుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిద్వారా అతనిపై రివెంజ్ తీసుకున్నట్లైందంటూ సమంత అభిమానులు శ్రుతి మించి మరీ కామెంట్లు పెడుతున్నారు. ఈ పారితోషికంతో నాగచైతన్యకు అంత తీసుకో అంటూ ఛాలెంజ్ విసిరిందని మరికొందరు రాస్తున్నారు.

Samantha challenged Naga Chaitanya regarding the remuneration

ఆక్సిజన్ సిలిండర్లు దగ్గర పెట్టుకొని
హనీబన్నీ యాక్షన్ సన్నివేశాల్లో నటించే సమయంలో సమంతకు దెబ్బలు తగిలాయి. మయోసైటిస్ కూడా ఉండటంతో షూటింగ్ మధ్యలో అకస్మాత్తుగా పడిపోయేది. ఒక్కోసారి ఆక్సిజన్ మాస్క్ లు పెట్టుకొని, ఆక్సిజన్ సిలిండర్లు దగ్గరుంచుకొని మరీ సిరీస్ ను పూర్తిచేసింది. ఆమె నిబద్ధతను ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. అందుకే అంత పారితోషికాన్ని చెల్లించారు. సమంతతోనే మరో సిరీస్ చేయడానికి రాజ్ అండ్ డీకే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే సమంత చేస్తుందా? లేదా? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఇప్పటికే ఐటం సాంగ్స్ చేయకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించింది. అలాగే వెబ్ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి వస్తుండటంతో వీటికి కూడా స్వస్తి పలికే యోచనలో సమంత ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+